iDreamPost
android-app
ios-app

కోటప్పకొండ తిరుణాల మీద కూడా రాజకీయ ఆరోపణలా?

  • Published Mar 01, 2021 | 5:49 AM Updated Updated Mar 01, 2021 | 5:49 AM
కోటప్పకొండ తిరుణాల మీద కూడా రాజకీయ ఆరోపణలా?

కోటప్పకొండ తిరునాళ్ల అంటే కోస్తా ప్రాంతంలో మంచి సందడి. ముఖ్యంగా గుంటూరు ,ప్రకాశం జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరవుతారు. కోటప్పకొండ తిరునాళ్ళకు కట్టే ప్రభలు ప్రత్యేకఆకర్షణ.చెక్కభజనలు,కోలాటాలతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతం మారుమోగుతోంది. సైరా చిన్నపరెడ్డి అంటూచెప్పే బుర్ర కథలు,కోటప్పకొండపై వస్తానని మొక్కుకున్నా లాంటి సినిమాపాటకు ప్యారడీగా పడే పాటలు.. ఒకటే సందడి.

రాజకీయాలకు అతీతంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్ల మీద టీడీపీ నేత లోకేష్ విమర్శలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరిగే తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు ఆదేశిస్తున్నారంటూ నారా లోకేష్ ఆరోపణలు చేయడం భాధ్యతారాహిత్యం . గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణ ఓటమి తర్వాత పార్టీని బతికించుకోవటానికి ప్రజల్లో అయోమయం సృష్టించి

వారిని తమ వైపు తిప్పుకొనే ఆలోచనతోనే తిరునాళ్ల మీద కూడా దుష్ప్రచారాలకు పూనుకొంది తెలుగు దేశం పార్టీ అనిపిస్తుంది .

ఇందుకు వారెంచుకొన్న మార్గాలు, దేవాలయాల పై దొంగ దాడులు , దుష్ప్రచారం , మతవిద్వేషాలు రేకెత్తించే ఆరోపణలు తద్వారా వైసీపీని అస్థిరపరచాలనేది టీడీపీ ఉద్దేశ్యం కావొచ్చు . ఈ క్రమంలోనే తిరుమల దేవస్థానం మొదలుకొని పలు ఆలయాలలో అపచారాలు అంటూ చేసిన దుష్ప్రచారాలు అవాస్తవమని నిరూపితం కావడంతో దేవాలయాల్లో విగ్రహాలు ధ్వసం లేదా మాయం చేసి దేవాలయాల పై దాడులు అంటూ అల్లర్లు సృష్టించే నీతి బాహ్యమైన కుట్రలకు తెగబడింది టీడీపీ పార్టీ .

Also Read:సీఎం అభ్యర్థి యానాం నుంచి బరిలోకి, పాతికేళ్ల ప్రస్థానంలో మల్లాడి కొత్త అడుగులు

విగ్రహాల ధ్వంసం , మాయం చేయడం వంటి కొన్ని ఘటనల్లో టీడీపీ కార్యకర్తలు దోషులుగా తేలడంతో తేలు కుట్టిన దొంగల్లాగా ఈ అంశాల పై నోరు మెదపకుండా తప్పుకున్నారు టీడీపీ నేతలు .దీనితో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు , ఇతర నిఘా వ్యవస్థల సమన్వయంతో ఆలయాల వద్ద భద్రతాచర్యలు పెంచడంతో ఆలయాల పై దాడులకు , దుష్ప్రచారాలకు దాదాపు తెర పడింది . అయినా తమ బుద్ధి మార్చుకోని కొందరు టీడీపీ నాయకుల దృష్టి త్వరలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరగబోతున్న కోటప్పకొండ తిరునాళ్ల పై పడింది . ఇదే అవకాశం అనుకొన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కోటప్పకొండలో ప్రభలు కట్టొద్దని అధికారులు ఆదేశిస్తున్నారు అంటూ దుష్ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు .

అబద్దం అయినా అతికేట్లు ఉండాలి ….

కోటప్పకొండ చరిత్ర , అక్కడ శివరాత్రి నాడు జరిగే తిరునాళ్ల వైభవం , కోటప్పకొండ తిరునాళ్ళలో ప్రభల సంస్కృతికి ఉన్న విశిష్ట స్థానం నారా లోకేష్ కి తెలిసి ఉంటే ఈ దుష్ప్రచారానికి తెగబడి ఉండేవాడు కాదేమో …

కోటప్పకొండ అభివృద్ధిలో టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ పాత్ర కూడా ముఖ్యమైనది.చారిత్రక విశిష్టత కలిగి రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర పండుగ హోదా కల్పించినాక భక్తుల తాకిడి గతంలో కన్నా పెరగడంతో మరింత శోభ సంతరించుకొంది . దీనితో తిరునాళ్ల నిర్వహణ భాద్యతలు నిర్వహించేవారి పై పనిభారం పెరిగింది . గత ఏడాది తిరునాళ్లకు వచ్చిన భక్తుల సంఖ్య తొమ్మిది లక్షల పై మాటే ఇంత భారీ ఎత్తున జరిగే తిరునాళ్ల ఏర్పాట్లు ఎవరెవరు నిర్వహిస్తారో , ఎలా నిర్వహిస్తారో కూడా బహుశా లోకేష్ కి తెలిసుండకపోవచ్చు .

Also Read:నారాయ‌ణ‌కు పీవీ మీద ఆయన కూతురుని మించిన అభిమానం ఉన్నదా?

గుంటూరు జిల్లా కలెక్టరేట్ మొదలుకొని ఎండోమెంట్ , పోలీస్ , రెవిన్యూ , రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ,పంచాయితీ రాజ్ , ఎలెక్ట్రికల్ , ఫైర్ , ఎక్సయిజ్ , ఆర్ అండ్ బీ , పబ్లిక్ హెల్త్ , రవాణా , గిరిజన సంక్షేమ , అటవీ , ఇరిగేషన్ శాఖల సిబ్బందితో పాటు ఎస్సీ , బిసి కార్పోరేషన్లతో పాటు , ఆర్టీసీ , స్కౌట్స్ అండ్ గైడ్స్ , ఎన్సీసి మొదలైన ప్రభుత్వ రంగ సిబ్బంది దాదాపు రెండు నెలల ముందు నుండి తిరునాళ్ల ఏర్పాట్ల విధుల్లో పాలుపంచుకొంటారు . స్థానిక నరసరావుపేట మునిసిపాలిటీ , పేట , రొంపిచర్ల మండల ఎండివో,ఎమ్మార్వో,ఆర్డీవో లతో పాటు విఆర్వో , విలేజ్ సెక్రటరీలు ఈ విధుల్లో తలమునకలయ్యి ఉంటారు .

ఈ అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొంటూ , ప్రతిరోజూ జరిగిన పనుల్ని , ఇంకా చేయాల్సిన ఏర్పాట్లని సమీక్షించుకొంటూ ఆయా శాఖల సిబ్బందికి మార్గదర్శనం చేసే బాధ్యత భుజాన మోసే నరసరావుపేట ఎమ్మెల్యేకు , ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి చివరి పదిరోజులూ సరిగ్గా నిద్రాహారాలు కూడా ఉండవు . ఏటికేడు పెరుగుతున్న భక్తుల తాకిడికి తగ్గట్లు ఏర్పాట్లు చేసి కోటప్పకొండ ప్రతిష్ట మరింత పెంచే దిశగా తీసుకొనే చర్యల నిమిత్తం అనుక్షణం ఉరుకులూ పరుగులే .

ఇన్ని ఏర్పాట్లు , భక్తుల సౌకర్యార్థం , భద్రత కోసం చర్యలు తీసుకొనేప్పుడు కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి . ప్రభల ఏర్పాటుకు పోలీస్ , ఫైర్ శాఖల నుండి ముందస్తు అనుమతి , ప్రభల ఎత్తు విషయంలో విద్యుత్ , ఆర్ అండ్ బీ , మున్సిపల్ , మండల కార్యాలయాల సూచనలు అనుసరించాల్సి ఉంటుంది . ఇవన్నీ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా , భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి మాత్రమే . ప్రస్తుతం కోవిడ్ 19 ప్రభావం , ఎమ్మెల్సీ , మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఆరోగ్య శాఖ సూచనలు , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు కూడా అదనంగా పాటించాల్సి ఉన్న పరిస్థితి .

Also Read:ఊర్లో ఉండాలంటే అచ్చెమ్ నాయుడి మాట వినాలసిందేనంట!!!

శతాబ్దాల చరిత్ర ఉన్న కోటప్పకొండ ప్రభలకు కొన్ని దశాబ్దాల నుండీ రాజకీయ రంగు పులుముకొన్న కారణంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పెద్ద , చిన్నా ప్రభలకు ఆయా గ్రామాల్లో రాజకీయ పార్టీల జెండాలతో అలంకరించి తీసుకురావడం జరుగుతుంది . ఈ విషయంలో చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద వివాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటూ వస్తున్నారు పోలీస్ ఇతర శాఖల వారు .

అయితే ఈ సంవత్సరం తిరునాళ్ల జరిగే టైంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం , పెద్ద ఎత్తున భక్తులు వచ్చే కారణంగా కరోనా ప్రబలే ప్రమాదం ఉండటంతో ఏటా ఉండే నిబంధనలు కాకుండా ఆరోగ్య , ఎన్నికల కమిషన్ కార్యాలయాల ఆదేశాలు , మార్గదర్శకాలు కూడా పాటిస్తూ ప్రభల నిర్మాణం , తరలింపు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీస్ , ఇతర శాఖల వారు స్పష్టం చేశారు కానీ శతాబ్దాలుగా పేరొందిన కోటప్పకొండ ప్రభల వైభవాన్ని నిలుపుదల చేయమని ప్రభుత్వం కానీ , పోలీస్ వారు కానీ , ఇతర ఏ శాఖ వారు కానీ ఆదేశించలేదు .

దాదాపు రెండు నెలల నుండి కోటప్పకొండ పోయే మార్గాల విస్తరణ , త్రాగునీరు , శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నది ప్రభలకు , భక్తులకు సౌకర్యవంతంగా ఉండటం కోసమే కానీ ప్రభలని ఆపటానికి కాదు అన్న సోయి కూడా లేకుండా లోకేష్ ఆరోపించి భక్తులు , ప్రభల నిర్వాహకులు , ప్రజల్లో అయోమయ , ఆందోళనకర పరిస్థితులు నెలకొనేట్లు అసత్య ఆరోపణలు చేయడం బాధాకరం .