iDreamPost
android-app
ios-app

రూట్ మార్చుకున్న మిడ‌తలు..తెలుగు రాష్ట్రాలు సేఫ్.! ఇంత‌కీ మిడ‌తలు రూట్ ఎందుకు మార్చుకున్నాయంటే…!

రూట్ మార్చుకున్న మిడ‌తలు..తెలుగు రాష్ట్రాలు సేఫ్.! ఇంత‌కీ మిడ‌తలు రూట్ ఎందుకు మార్చుకున్నాయంటే…!

ఎడారి ప్రాంతాల నుండి బ‌య‌లు దేరిన మిడ‌త‌ల దండు రాజ‌స్థాన్ గుజ‌రాత్ రాష్ట్రాల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న విద‌ర్భ ప్రాంతం నుండి త‌మ రూట్ మార్చుకొని మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపు వెళుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊపిరిపీల్చుకున్నాయి. లేదంటే పంటల మీద ప‌డి పీల్చి పిప్పిచేసేవి ఆ మిడ‌తలు. అయితే తెలంగాణలో కొన్న ప్రాంతంల్లో ఈ మిడతలు కలకలం సృష్టించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోనూ, విజయనగరం జిల్లా పాచిపెంట ఏజెన్సీలోనూ, చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో మిడతలు హల్ చల్ చేశాయి. అయితే వ్యవసాయ అధికారులు భయపడాల్సిన అవసరం లేదని తెలుపుతున్నారు.

ఇంత‌కీ మిడ‌తలు రూట్ ఎందుకు మార్చుకున్నాయి?

మిడ‌త‌లు 2 గ్రాముల నుండి 5 గ్రాముల వ‌ర‌కు బ‌రువు ఉంటాయి. సాధార‌ణంగా ఎగిరే ప్రాణులు గాలిని ఆధారంగా చేసుకొని ప్ర‌యాణం చేస్తుంటాయి. ఈరోజు గాలి ఉత్త‌రం వైపుకు గంట‌కు 15 కిలోమీట‌ర్ల వేగంతో వీయ‌డం కార‌ణంగామ‌హారాష్ట్రలోని విధ‌ర్భ‌లో తిష్ట‌వేసిన మిడ‌త‌లు…త‌మ రూటును గాలి వీచే దిశ‌వైపు మ‌ళ్లించాయి.

ఒక వేళ గాలివీచే దిశ‌కు వ్య‌తిరేఖంగా ప్ర‌యాణించాలంటే అవి త‌మ శ‌క్తిని 3 రెట్లు పెంచాల్సి ఉంటుంది. అదే గాలివీచే దిశ‌లో అయితే త‌మ శ‌క్తిలో స‌గం శ‌క్తిని కేటాయించిన స‌రిపోతుంది. గాలి ఉత్త‌రం వైపు వీచింది కాబ‌ట్టి… మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపుకు వెళుతున్నాయి. అదే ద‌క్షిణం వైపు వీస్తే ఈ పాటికే తెలంగాణ లోకి ఎంట‌ర్ అయ్యిండేయి.!

ఇక మిడ‌త‌లు రాన‌ట్టేనా.?

చెప్ప‌లేము…ఎందుకంటే మిడ‌త‌లు ఒక రోజులో 100 నుండి 150 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌గ‌ల‌వు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుండి మ‌న రాష్ట్రానికి రాడానికి 3 రోజుల స‌మ‌య‌మే ప‌డుతుంది. కనుక ఈ స‌మ‌స్య‌ పూర్తిగా ప‌రిష్కార‌మైంద‌ని అనుకోలేము. మిడ‌తల జీవిత కాలం 10 రోజుల మాత్రమే. ఇవి త‌మ శరీరానికి స‌మాన‌మైన తిండిని తింటాయి. మిడ‌త‌ల దండులో దాదాపు కోటి మిడ‌త‌లుంటాయి.‌ ఇవి ఒక పంట‌మీద దాడికి దిగితే 35 వేల మందికి స‌రిపోయే ధాన్యాన్ని గంట‌లో తినేస్తాయి. కనుక వీటి ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş