iDreamPost
android-app
ios-app

Liger: నా సినిమా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయికి రీమేక్ కాదు. నేను ఎప్పటికీ రిమేక్స్ చేయను

  • Published Aug 16, 2022 | 1:19 PM Updated Updated Aug 16, 2022 | 1:19 PM
Liger: నా సినిమా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయికి రీమేక్ కాదు. నేను ఎప్పటికీ రిమేక్స్ చేయను

విజయ్ దేవరకొండ సినిమా లిగర్ ఆగస్ట్ 25, 2022న థియేట‌ర్ల‌లోకి వస్తోంది. ఇప్ప‌టికే దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న విజ‌య్, హిందీ మార్కెట్ లో క‌ర‌ణ్ జోహార్ అండ‌తో బ‌జ్ ను క్రియేట్ చేయ‌గ‌లిగాడు. ఫ‌స్ట్ రోజు బాక్సీఫీస్ క‌లెక్ష‌న్స్ ను కుమ్మేయ‌డానికి లైగ‌ర్ రెడీ. ఈ స‌మ‌యంలోనే రవితేజ సూప‌ర్ హిట్ మూవీ అమ్మా, నాన్న‌, త‌మిళ అమ్మాయి రిమేక్ అని కొంత‌మంది ఫ్యాన్స్ పోస్ట్ లు చేస్తున్నారు.

కరణ్ జోహార్ సహ-నిర్మాగా చేసిన పాన్-ఇండియా సినిమాకాబ‌ట్టి లైగ‌ర్ విజయ్ బాలీవుడ్‌లో అరంగ్రేట‌మే. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు, ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ కు ఆడియ‌న్స్ ఫిదా. ఇప్పుడు, రిలీజ్ డేట్ ఆగస్ట్ 25, 2022 కోసం ఎదురుచేస్తున్నారు. ఫ‌స్ట్ డే హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ చూడొచ్చ‌ని బాలీవుడ్ ఆశ‌గా ఎదురుచూస్తోంది. కాని రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి లైగర్ రీమేక్ అని పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ముంబై మీడియా ఈ సినిమా రిమేక్ అని భావిస్తుండటంతో, మీడియా ఇంటరాక్షన్‌లో విజయ్ లైగ‌ర్ సినిమా గుట్టు విప్పాడు.

తన సినిమా లైగర్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయికి పూర్తి భిన్నంగా ఉంటుందని విజయ్ దేవరకొండ తేల్చిచెప్పారు. తాను ఏ రీమేక్ చేయ‌న‌ని చెప్పాడు. “నాకు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ లిగర్ వేరే త‌ర‌హా సినిమా. MMA స్పోర్ట్ బాక్సింగ్ వేరు. తల్లీ కొడుకుల అనుబంధం లైగ‌ర్ కు USP. ఈ సినిమాలో చాలా ఇతర క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఎప్పటికీ రీమేక్‌లు చేయను. నిజానికి నాకు రీమేక్‌లు చేయడం ఇష్టం లేదు.”

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş