గత కొన్ని వారాలుగా, దేశవ్యాప్తంగా COVID-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. Omicron వేరియంట్ మరింత ఆందోళన కలిగిస్తుంది. చిత్ర పరిశ్రమలో కూడా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఎంతో మంది సెలబ్రిటీలకు వైరస్ సోకింది. ఇక ప్రముఖ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ గారికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం లతా మంగేష్కర్ గారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICUలో చేర్చి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు.
లతా మంగేష్కర్ మేనకోడలు రచనా మంగేష్కర్, ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించారు. “లతా మంగేష్కర్ గారు బాగానే ఉన్నారు, ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త కారణాల కోసం మాత్రమే ICUలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి, ”అని రచన చెప్పారు.
ఇదిలా ఉంటే మన దేశం COVID-19 కేసులలో ఊహించని పెరుగుదలను ఎదుర్కొంటోంది, గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 1,68,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య భయంకరంగా పెరగడంతో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించాయి మరియు పాక్షిక లాక్‌డౌన్‌ను విధించాయి.
Also Read : Sarkaru Vaari Paata : మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే