iDreamPost
android-app
ios-app

నాణ్యత ప్రమాణాలకు మంగళం – కుషాయిగూడ డీ మార్ట్ సీజ్..

నాణ్యత ప్రమాణాలకు మంగళం – కుషాయిగూడ డీ మార్ట్ సీజ్..

నిత్యావసర వస్తువులతో పాటు ఏవైనా సరుకులు కొనాలంటే పేద, మధ్య తరగతి ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది డీ మార్ట్ షాపింగ్ మాల్స్.. నాణ్యతతో కూడిన వస్తువులను అందించడంతో పాటు సరైన ప్రమాణాలు పాటిస్తూ డీ మార్ట్ షాపింగ్ మాల్స్ ప్రజలకు అందుబాటు ధరల్లో తమ సేవలను అందిస్తాయన్న పేరు ఉంది. కానీ కొన్ని డీ మార్ట్ షాపింగ్ మాల్స్ మాత్రం నాణ్యతను తుంగలో తొక్కి, తూనికలు కొలతల్లో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నాయి. తాజాగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తూనికలు కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్న ఓ డీ మార్ట్ ని సీజ్ చేశారు అధికారులు..

వివరాల్లోకి వెళితే కుషాయిగూడ డీ మార్ట్ లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ కాప్రా సర్కిల్ GHMC అధికారులకు ఫిర్యాదులు వినియోగదారుల నుండి ఫిర్యాదులు రావడంతో ఆ డీ మార్ట్ ను అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. కుషాయిగూడలోని డీ మార్ట్ లో శివ సాయి నగర్ కు చెందిన వినియోగదారుడు కిరాణా సరుకులతో పాటు, 20 ప్యాకెట్ల ఖర్జూరాలను కొనుగోలు చేసాడు. కాగా ప్యాకెట్ సీల్ మంచిగా ఉన్నా వాటిలో కుళ్ళిపోయిన ఖర్జూరాలను ప్యాక్ చేసారని గుర్తించిన ఆ వినియోగదారుడు డీ మార్ట్ లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత అధికారులకు పిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న కాప్రా సర్కిల్ GHMC ఏఎంహెచ్ఓ మైత్రి, కుషాయిగూడ ఎస్సై మదన్ లాల్ డీ మార్ట్ కి వెళ్లి సరుకులు, కొలతలను పరిశీలించారు. అనంతరం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయాలు నిర్వహిస్తున్నారని గుర్తించిన అధికారులు ఆ డీ మార్ట్ ను సీజ్ చేశారు.