iDreamPost
android-app
ios-app

వావ్‌.. దావోస్ లో ఏపీ సీఎం జ‌గ‌న్ తో కేటీఆర్ ఆత్మ‌య భేటి

  • Published May 24, 2022 | 11:51 AM Updated Updated May 24, 2022 | 11:51 AM
వావ్‌.. దావోస్ లో ఏపీ సీఎం జ‌గ‌న్ తో కేటీఆర్ ఆత్మ‌య భేటి

దావోస్ తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల పెట్టుబడుల వేట మిగిలిన వారికి అసూయ క‌లించే స్థాయిలో సాగుతోంది. అదే స‌మ‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ క‌లుసుకున్నారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు, ఫొటో దిగారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్. జ‌గ‌న్‌తో భేటీపై కేటీఆర్ ఆత్మీయ ట్వీట్ చేశారు.

సీఎం జ‌గ‌న్ తో కేటీఆర్ క‌ల‌యిక‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏపీపై కేటీఆర్ తొంద‌రపాటు వ్యాఖ్య‌లు, ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ఏపీపై కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు మంత్రులు, వైసీపీ నేత‌లు కౌంట‌ర్లుచ్చారు. ఇద్ద‌రి మ‌ధ్య కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల త‌రుణంలో దావోస్‌ ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు జ‌గ‌న్‌, కేటీఆర్ వెళ్లారు.

పారిశ్రామిక వేత్త‌ల‌ను, భారీ కంపెనీల‌ను రాష్ట్రాల‌కు ఆహ్వానించారు. చాలా సంస్థ‌ల‌తో ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆస‌మ‌యంలోనే సీఎం జ‌గ‌న్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు.

ఇద్ద‌రు నేత‌లు ఆత్మ‌యంగా ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రి క‌లిసిన ఫోటోతో కేటీఆర్ ట్వీట్ చేశారు. “నా సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గొప్ప‌గా జ‌రిగింది” అంటూ ట్వీట్‌చేశారు.