iDreamPost
android-app
ios-app

కృతిశెట్టిని లైవ్ లో ఏడిపించిన ప్రాంక్ స్టార్లు.. నెటిజెన్ల ఆగ్రహం..

  • Published May 30, 2022 | 5:18 PM Updated Updated May 30, 2022 | 5:18 PM
కృతిశెట్టిని లైవ్ లో ఏడిపించిన ప్రాంక్ స్టార్లు.. నెటిజెన్ల ఆగ్రహం..

చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్ అయిపోయి స్టార్ డం తెచ్చుకుంది కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో అందర్నీ మాయ చేసి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మెప్పించి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం రామ్, సుధీర్ బాబు, నితిన్, సూర్యతో సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల చెన్నైలోని ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ ఫంక్షన్ కార్యక్రమాలలో భాగంగా వచ్చిన సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేశారు.

ఇందులో భాగంగా కృతిని తమిళ్ లో ఫేమస్ అయిన తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఇంటర్వ్యూలో వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో ఇదంతా ప్రాంక్ అని తెలియక అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కృతి మొదట భయపడింది.

తర్వాత వారు ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో మొదట నవ్వినా ఆ తర్వాత వెంటనే దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది కృతిశెట్టి. కృతి ఇలా లైవ్ లో ఏడ్చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సరదాగా చేద్దామనుకున్న ప్రాంక్ కాస్త సీరియస్ గా మారి కృతిశెట్టి ఏడ్చే వరకు వెళ్ళింది. చాలా మందికి ఫేవరేట్ అయిన కృతి ఇలా లైవ్ లో ఏడ్చేసరికి కృతి ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృతిని ఏడిపించిన ఆ ప్రాంక్ స్టార్లు ఇద్దర్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş