iDreamPost
android-app
ios-app

క్రాక్ టార్గెట్ చాలా పెద్దది

  • Published Dec 08, 2020 | 6:53 AM Updated Updated Dec 08, 2020 | 6:53 AM
క్రాక్ టార్గెట్ చాలా పెద్దది

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ గోవా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని బాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంది. త్వరలోనే ఫైనల్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు వెళ్ళబోతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ దీని తర్వాత నేరుగా వకీల్ సాబ్ సెట్స్ లో జాయిన్ కాబోతోంది. ఇదిలా ఉండగా 2021 సంక్రాంతికి ఖచ్చితంగా విడుదలయ్యే సినిమాల్లో క్రాక్ పేరే గట్టిగా వినిపిస్తోంది. మిగిలినవి రేస్ లో ఉన్నా లేకపోయినా, ప్రభుత్వాలు థియేటర్లలో వంద శాతం సీట్లకు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ధైర్యం చేసి రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేసుకుంటున్నట్టు వినికిడి.

అయితే క్రాక్ పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్దగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీని బడ్జెట్ ఇప్పటికీ ముప్పై కోట్లు దాటేసిందట. మాములు పరిస్థితుల్లో రవితేజ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మొత్తం షేర్ రూపంలో ఈజీగానే వస్తుంది. కానీ ఇప్పుడు అదంత సులభం కాదు. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మొన్న హైదరాబాద్ లో థియేటర్లు ఓపెన్ చేస్తే టెనెట్ కోసం మూడు రోజులు జనం మల్టీ ప్లెక్సులను ఫుల్ చేశారు కానీ నిన్నటి నుంచి చాలా చోట్ల డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది. అది హాలీవుడ్ మూవీ కాబట్టి ఇంతకన్నా ఆశించలేం కానీ తెలుగు సినిమా వస్తేనే క్లారిటీ వస్తుంది.

ఈ లెక్కన క్రాక్ మాములుగా ఆడితే సరిపోదు. కనీసం మూడు నాలుగు వారాలు హౌస్ ఫుల్ బోర్డులు పడాలి. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు దీన్నే వేసుకోవాలి. అన్నింటిని మించి టాక్ యునానిమస్ గా పాజిటివ్ గా రావాలి. లేకపోతే కష్టమే. యూనిట్ మాత్రం ఫలితం పట్ల చాలా ధీమాగా ఉంది. అసలే రవితేజకు గత డిజాస్టర్లు కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేక చతికిలపడ్డాయి. అలాంటిది క్రాక్ ఇలాంటి ప్రతికూలమైన వాతావరణంలో భీభత్సమైన వసూళ్లు రాబట్టుకోవాలి. అది కనక చేయగలిగితే మిగిలిన నిర్మాతలకు సైతం ధైర్యం వచ్చి ఎలాంటి సంకోచం లేకుండా తమ సినిమాలు కూడా విడుదలకు సిద్ధం చేస్తారు. చూడాలి ఏం జరుగుతుందో.