iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: విడాకుల గురించి సమంతను, ప‌చ్చ‌ని సంసారం గురించి అక్షయ్ కుమార్‌ని అడిగి, కరణ్ జోహార్ దిగజారిపోయాడా? స‌మంత ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు?

  • Published Jul 23, 2022 | 5:34 PM Updated Updated Jul 23, 2022 | 5:34 PM
Koffee With Karan 7: విడాకుల గురించి సమంతను, ప‌చ్చ‌ని సంసారం గురించి అక్షయ్ కుమార్‌ని అడిగి, కరణ్ జోహార్ దిగజారిపోయాడా? స‌మంత ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు?

ఎప్పుడూ గాసిప్స్, శృంగార అల‌వాట్లు, సెల‌బ్రిటీ సీక్రెట్ల గురించి మాట్లాడే కరణ్ జోహార్, స‌మంత‌-అక్షయ్ కుమార్ ఎపిసోడ్ లో మాత్రం మామయ్య‌లా ప్రవ‌ర్తించాడు. అందులోనూ, స‌మంత విడాకుల గురించే మాట్లాడారు.

కాఫీ విత్ కరణ్ 7 మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి. షోలో చాలా ప‌ర్స‌న‌ల్ గా, పక్షపాతంతో వ్య‌వ‌హారించాడ‌ని కరణ్ జోహార్‌పై ఆడియ‌న్స్ గుర్రుగా ఉన్నారు. సమంత- అక్షయ్ కుమార్ మూడో ఎపిసోడ్ ఫ్యాన్స్ కి బాగా న‌చ్చింది. నిజానికి, స‌మంత నిక్క‌చ్చిత‌నాన్ని, ధృడ‌మైన వ్య‌క్తిత్వాన్ని ఈ ఎపిసోడ్ ఆవిష్క‌రించింద‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో విడాకుల త‌ర్వాత‌కూడా ఆమె ప‌డుతున్న మానసిక వేద‌న‌తోపాటు, కాస్త కోపాన్ని కూడా ఈ షో, వ‌డ‌గ‌ట్టి చూపించింది. కాని ఇక్క‌డే KJO బిహేవియ‌ర్ మీద వీక్ష‌కులు సంతోషంగా లేరు. క‌ర‌ణ్ ఏదో ప‌నిగ‌ట్టుకొని సమంతను ఎక్కువగా ఆమె విడాకుల గురించి మాత్రమే అడిగాడు. అదే అక్షయ్ కుమార్ గురించి మాట్లాడిన‌ప్పుడు, నీ వివాహం విజ‌య‌వంతంగా న‌డ‌వ‌డంలో వెనుకున్న రహస్యం గురించి అడిగాడు. అంటే విడాకులంటే స‌మంత‌? ప‌ండంటి కాపురం గురించి చెబితే అక్ష‌య్ కుమారా? ఏంటీ KJo పక్షపాతం? షో వీక్షకులకు అస్స‌లు న‌చ్చ‌లేదు. అందుకే క‌ర‌ణ్ ని తిట్టిపోశారు. అత‌న్ని ప‌క్కింటి పిన్నిగార‌ని పేరుకూడా పెట్టారు. విమ‌ర్శిస్తున్నారు.

స‌మంత ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతోంది. మ‌ళ్లీ విడాకుల గురించి ప‌దేప‌దే అడ‌గ‌డమంటే ఇంకా బాధ‌పెట్టిన‌ట్లేన‌ని కొంద‌రంటే, స‌మంత‌గాయం మీద క‌ర‌ణ్ కారంపోసాడ‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేశారు.

కరణ్ జోహార్ సారా అలీ ఖాన్‌ను డౌన్‌గ్రేడ్ చేసి, జాన్వీ కపూర్‌ను అప్‌గ్రేడ్ చేసినందుకుకూడా అభిమానులు కోపంగా ఉన్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap