iDreamPost
android-app
ios-app

లోకేష్ కోసమే ఎన్టీఆర్ ని దూరం పెట్టారు

లోకేష్ కోసమే ఎన్టీఆర్ ని దూరం పెట్టారు

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి పై ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు చేసారు. ఓటమిని జీర్ణించుకోలేకనే చంద్రబాబు నాయుడు మతం పేరుతో విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తిరుపతికి వెళ్ళడానికి ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలో చంద్రబాబు చెప్పాలని అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఒక కులానికో ఒక మతానికో ముఖ్యమంత్రి కాదని తెలిపారు. తాను ఇంతకు ముందు విమర్శలు చేసింది చంద్రబాబుపైనే అని కానీ వాటిని మతాల గొడవల్ల చంద్రబాబు మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలకోసం తిరుపతి వెంకటేశ్వరస్వామిని లాగుతున్నారని కొడాలి నాని పేర్కొన్నారు.

తిరుపతి లడ్డుని మద్యంతో పోల్చినందుకు, అలిపిరి వద్ద చంద్రబాబు తల కొండకు బాదుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. వెంకటేశ్వరస్వామిమి కులదైవంగా చెప్పుకునే చంద్రబాబు తిరుపతికి వెళ్లి ఒక్కసారైనా గుండు కొట్టించుకున్నారా అని నాని ప్రశ్నించారు. లోకేష్ కోసమే ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టారని విమర్శించారు. ఒకవేళ ఎన్టీఆర్ రోడ్డుమీదకు వస్తే చంద్రబాబు లోకేష్ అడ్రెస్ లేకుండా పోతారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కొడాలి నాని ధ్వజమెత్తారు.