iDreamPost
android-app
ios-app

ఆ మాజీ మంత్రి భయపెడుతున్నాడట..

ఆ మాజీ మంత్రి భయపెడుతున్నాడట..

ఆ మాజీ మంత్రికి పనిపాట లేదట. అందుకే విజయవాడ చుట్టుపక్కల తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారట. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే టీడీపీ నేత మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడట. ఈ మాటలన్నది ఎవరో కాదు మరో మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొడాలి నాని. ఈ మాటలన్నది ఎక్కడో కాదు.. సాక్షాతూ అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళం లోనే కావడం గమనార్హం. కృష్ణ జిల్లా మంత్రి అయిన కొడాలి నాని తమ జిల్లా ప్రజలను అచ్చెన్నాయుడు భయపెడుతున్నదంటూ అతని జిల్లా ప్రజల ముందు చెప్పారు.

మనబడి నాడు – నేడు కార్యక్రమం సందర్భంగా రాజాం లో మంత్రి కొడాలి ఈ వ్యాఖ్యలు చేసారు. మంత్రి మాటల వెనుక అర్ధాన్ని గ్రహించని కొంత మంది సభికులు… అచ్చెన్నాయుడు ఎలా భయపెడుతున్నారో అర్ధం గాక తెల్లమొహాలు వేయగా.. మంత్రి మాటల్లో ఎటకారం అర్ధం చేసుకున్న కొంత మంది సభికులు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వారట.

టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పై ఒంటికాలిపై లేచేవారు. భారీకాయుడైన అచ్చెన్నాయుడుకు అదే స్థాయిలో గొంతు ఉంది. అసెంబ్లీ లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై ఏకవచంతో విరుచుకుపడేవారు. వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలపై కూడా తిట్ల దండం అందుకునేవారు. మీడియా తో మాట్లాడేటప్పుడు కూడా అచ్చెన్నాయుడులో అదే వేగం కనపడేది. ఇలాంటి తీరు ఉన్న అచ్చెన్నాయుడు పై అప్పట్లో వైస్సార్ సిపి శ్రేణులు సోషల్ మీడియాలో ఎటకారంగా పోస్టులు పెట్టేవారు. అచ్చెన్నాయుడు ని ఆంబోతు తో పోలుస్తూ విరివిగా పోస్టులు పెట్టేవారు.

అధికారం మారిన తర్వాత కూడా ప్రారంభంలో అదేతీరు ను అచ్చెన్నాయుడు అసెంబ్లీ లో కొనసాగించారు. ప్రస్తుతం టిడిపిలో గొంతు ఉన్న వారిలో అచ్చెన్నాయుడు కొంత ఉత్సహంగా పని చేస్తున్నారు. మిగతా వారు సైలంట్ అయ్యారు. గతంలో వైఎస్సార్ సిపి శ్రేణులు సోషల్ మీడియా లో పెట్టిన ఆంబోతు పోస్టుల నేపథ్యంలోనే.. మంత్రి కొడాలి నాని విజయవాడ ప్రజలను అచ్చెన్నాయుడు భయపెడుతున్నారంటూ ఎటకారం గా మాట్లాడారాని చెబుతున్నారు.