గజ ఈతగాళ్లు గెడ్డలోపడి కొట్టుకుపోవడం అంటే ఇదే మరి. పెద్ద పెద్ద ఎన్నికలు, లోక్ సభ, ఆపెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించి మన్యంలో తనకు ఎదురే లేదని అప్పట్లో చాటిచెప్పిన చిన్నమేరంగి జమీందార్ శతృచర్ల విజయరామరాజు, కురుపాం రాజు కిషోర్ చంద్రదేవ్ సైతం ఇప్పుడు వీచిన ఫ్యాన్ గాలికి కొట్టుకుపోక తప్పలేదు.
గతంలో జనతాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతోబాటు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి ఉత్తరాంధ్ర టైగర్ అనే పేరును పాంతం చేసుకున్న శతృచర్ల విజయరామరాజు తన స్వగ్రామం అయిన చినమేరంగిలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.
Also Read:చంద్రబాబు కోటకు బీటలు!బీజం నాడే పడిందా?
2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశంలో చేరిన విజయరామరాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. పూర్వపు నాగూరు అసెంబ్లీ నియోజక వర్గంతోపాటు పార్వతీపురం లోకసభ నియో జకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం కురుపాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి స్వయానా పెదమామ అవుతారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పంచాయ తీ ఎన్నికల్లో ఎటు చూసినా ఫ్యాన్ గాలి వేగంగా వీస్తుండడంతో చివమేరంగిలో ఆయన బలపర్చిన అభ్యర్థి ఓడిపోగా వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పుష్ప శ్రీవాణి నిలబెట్టిన అల్లు రమణమ్మ గెలుపొందారు. ఈ విషయంలో తామ ఎంతగా ప్రభావితం చేయాలని భావించినా విజయరామరాజు అశక్తుడుగానే మిగిలిపోయారు.
కిషోర్ కూ ఓటమి తప్పలేదు
ఇక కేంద్రరాజకీయాల్లో ఉద్దండుడుగా పేరుపొందిన కురుపాం సంస్థానాధీసుడు, ఆరేడు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రి గా పని చేసిన కిశోర్ చంద్రదేవ్ కు సైతం గట్టి జెల్ల తగిలింది. అప్పట్లో ఈయన చిటికేస్తే ప్రధానులు సైతం పలికే వారు, కేంద్రంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా ఢిల్లీలో రాజకీయా లు చేసిన కిశోర్ సైతం తన స్వగ్రామంలో ఓటమిపాలయ్యారు.
ముప్పయేళ్లపాటు కాంగ్రెస్లో కొనసాగిన కిశోర్ చంద్రదేవ్ సైతం 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి అరకు మంచి లోక్ సభకు పోటీ చేసి వైఎస్పార్ కాంగ్రెస్ కు చెందిన గొట్టేటి మాధవి చేతిలో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో కిషోర్ కూతురు శృతీదేవి కాంగ్రెస్ తరుపున పోటీచేయటం స్థానికులను ఆశ్చర్యపరిచింది,తండ్రి మీద కూతురు పోటీనా అంటూ చర్చించుకున్నారు.ఇక నిన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఆయ న బలపర్చిన అభ్యర్థి ఓడిపోగా వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన గార్ల సుజాత గెలుపొందారు.
Also Read:మూడులో సైతం.. ముచ్చటైన విజయం!
ఇక 2014-19 మధ్య పాఠ్వతీపురం తెలుగుదేశం ఎమ్మెల్యేగా పని చేసిన బొబ్బిలి చిరంజీవులు సైతం తన అభ్యర్థిని స్వగ్రామంలో గెలిపించుకో లేకపోయారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా తాను బలపర్చిన వ్యక్తి ఓడిపాగా అక్కడి ఎమ్మెల్యే జోగారావు బలపర్చిన బోన రామునాయుడు విజయఢంకా మోగించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో యోధానుయోధులు తాము గతంలో ఉజ్వలంగా వెలుగొందిన గ్రామాల్లో ఈపారి దెబ్బతిన్నారు చివరకు విజయనగరం సంస్థానాధీకుడు అశోక్ గజపతిరాజు సైతం కేవలం ఐదారు పంచాయుతీలతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. 22 పంచాయతీలకుగామ ద్వారపూడి, బియ్యాలపేట, చిల్లపేట వంటి ఐదారు పల్లెల్లోనే అశోక్ ప్రభావం చూపగలిగారు, మిగలా పంచాయతీల ప్రజలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జై కొట్టారు.