iDreamPost
android-app
ios-app

నేటినుండి తెరుచుకోనున్న కజిరంగా నేషనల్ పార్క్..

నేటినుండి తెరుచుకోనున్న కజిరంగా నేషనల్ పార్క్..

వరదలు, కరోనా వైరస్ కారణంగా ఏడు నెలలుగా మూతపడిన కజిరంగా నేషనల్ పార్కు నేటి నుంచి తెరుచుకోనుంది. అతిపెద్ద జాతీయ పార్కు అయిన కజిరంగా తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో కజిరంగా పార్కు పునః ప్రారంభ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుక్లబైద్యాలు పాల్గొంటున్నారు..

గత ఏడు నెలలుగా కరోనా వైరస్ వరద విపత్తుల కారణంగా కజిరంగా జాతీయ ఉద్యానవనం, పులుల అభయారణ్యాలు మూతబడ్డాయి. వరదల కారణంగా కజిరంగా నేషనల్ పార్కులో 18 ఖడ్గమృగాలు, 107 జింకలు, 6 అడవిగేదెలు, 12 అడవి పందులతో సహా మొత్తం 153 అడవి జంతువులు మరణించాయి. దానికి తోడు కరోనా వైరస్ దేశంలో తీవ్రస్థాయిలో విజృంభించడంతో సందర్శకులను పార్కులోకి అనుమతించలేదు. కాగా నేటి నుండి పార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు.

కజిరంగా పార్కును సందర్శించేవారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏనుగు సఫారీని మాత్రం నవంబరు 1వతేదీ నుంచి ప్రారంభిస్తామని, జాతీయ వనంలోని డోంగా వాచ్ టవర్, బిమోలి టినియాలిలను త్వరలో తెరుస్తామని నేషనల్ పార్కు డైరెక్టరు శివకుమార్ వెల్లడించారు. కజిరంగా పార్కులో జీపు సఫారీని కూడా అనుమతించనున్నారు.