నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు .. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ఓ లారీని ఢీ కొనడంతో మహేష్ గాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో మహేష్‌కు ప్రాణాపాయం తప్పింది. ఆయన తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం త్రీవంగా దెబ్బతిన్నది.
సినీ విమర్శకుడుగా ఉన్న కత్తి మహేష్.. బిగ్‌బాస్ షోలోనూ పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రజలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయ్యారు. వర్తమాన సినీ, రాజకీయాలు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అభిమానులకు ఆయన లక్ష్యంగా మారుతూ ఉంటారు.
Also Read : లోకేష్.. ఇంకా ఏం చేయాలి?