ఏపీ సీఎం జగన్ పాలన నీరోను తలపించేలా ఉందని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇసుక దొరక్క కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైసీపీ వాళ్లు ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చే పిచ్చి పనుల్లో ఉన్నారని విమర్శించారు. జాతీయజెండా రంగును కూడా మార్చి.. వైసీపీ రంగు వేసుకునే వరకు పిచ్చి ముదిరిందని కన్నా ఎద్దేవా చేశారు.