iDreamPost
android-app
ios-app

మహేష్ అన్న దాంట్లో తప్పేముంది.. మహేష్ బాలీవుడ్ వ్యాఖ్యలపై కంగనా సపోర్ట్..

  • Published May 13, 2022 | 6:20 PM Updated Updated May 13, 2022 | 6:20 PM
మహేష్ అన్న దాంట్లో తప్పేముంది.. మహేష్ బాలీవుడ్ వ్యాఖ్యలపై కంగనా సపోర్ట్..

మహేష్ బాబు ఇటీవల మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనగా ఓ విలేఖరి మహేష్ ని మీరెప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడతారు అని అడగడంతో మహేష్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ నన్ను భరించలేదు, నేను నా టైం వేస్ట్ చేసుకొను, నాకు తెలుగులోనే హాయిగా ఉంది అని అన్నారు. అయితే ఈ మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగగా మహేష్ మరో ఇంటర్వ్యూలో దీనిపై నేను తప్పుగా మాట్లాడలేదు అని అతను చేసిన వ్యాఖ్యలకి వివరణ కూడా ఇచ్చారు.

అయినా మహేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా మహేష్ వ్యాఖ్యలపై స్పందించగా తాజాగా మహేష్ వ్యాఖ్యలపై బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా మాట్లాడింది. అయితే కంగనా మహేష్ కి సపోర్ చేస్తూ మాట్లాడటం విశేషం.

కంగనా తన ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో ఉండగా ఓ విలేఖరి బాలీవుడ్ పై మహేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దీనికి కంగనా సమాధానమిస్తూ.. మహేష్ చెప్పింది నిజమే. బాలీవుడ్ ఆయనని భరించలేదు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఆయనతో సినిమా కోసం చాలా మంది సంప్రదించారు. బాలీవుడ్ ఆయనకి తగిన రెమ్యునరేషన్ ఇవ్వదు. అయినా ఇందులో కాంట్రవర్సీ చేయడానికి ఏముంది. తన టాలీవుడ్ పైన తను గౌరవం చూపించుకున్నాడు, దాంట్లో తప్పు లేదు. ఇటీవల టాలీవుడ్ ఎంతో కష్టపడి బాగా పైకి ఎదిగింది. దాన్ని మనం అంగీకరించాలి. టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని తెలిపింది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş