iDreamPost
android-app
ios-app

కల్కి భూములు పేదలకు పంచాలి: మంత్రి ఆదిమూలపు

కల్కి భూములు పేదలకు పంచాలి: మంత్రి ఆదిమూలపు

ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్‌ అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఆంద్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు మంత్రి సురేశ్‌ ఆరోపించారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోందని, ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలన్నారు. కల్కికి సంబంధించిన ఆధారాలు వెంటనే బయట పెట్టాలని కోరారు. కల్కి భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సురేశ్‌ చెప్పారు.

 కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్ల భారత కరెన్సీ, రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం