iDreamPost
android-app
ios-app

Kajal Aggarwal : తల్లి కాబోతున్న కాజల్.. గుడ్ న్యూస్ చెప్పిన భర్త

Kajal Aggarwal : తల్లి కాబోతున్న కాజల్.. గుడ్ న్యూస్ చెప్పిన భర్త

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ వార్త చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ఆమె ముందే ఒప్పుకున్న కొన్ని సినిమాల నుంచి తప్పుకోవడంతో ఆమె గర్భవతి అయిందని అందుకే ఆమె సినిమాల నుంచి తప్పుకుంటోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ విషయాల మీద నేరుగా స్పందించని కాజల్ అగర్వాల్ ఇప్పుడు గర్భవతి అని, ఆమె భర్త గౌతమ్ అనూహ్యంగా వెల్లడించాడు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ఉన్న ఒక ఫోటో పంచుకుంది. ఆ ఫోటోలో కాజల్ అగర్వాల్ బేబీ బంప్ కనిపిస్తోందని చాలా మంది కామెంట్లు చేశారు. కానీ వారి నుంచి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి కామెంట్లు చేయకూడదు కాబట్టి చాలామంది సైలెంట్ గా ఉండి పోయారు.

అయితే అనూహ్యంగా ఆమె భర్త గౌతమ్ మాత్రం కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ఒకదానిని షేర్ చేసిన గౌతమ్ దానికి ప్రెగ్నెంట్ లేడీ ఎమోజి ఒక దాన్ని పోస్ట్ చేసి 2022 కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. అంటే కాజల్ అగర్వాల్ 2022 వ సంవత్సరంలో తల్లి కాబోతోందని ఆయన చెప్పకనే చెప్పాడు అంటూ నెటిజన్లు తీర్పు ఇచ్చారు. నిజానికి కాజల్ అగర్వాల్ ఒక రకంగా సినిమాల విషయంలో వెనుకబడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంది. గౌతమ్ తో చాలా రోజుల నుండి ప్రేమలో ఉన్న ఆమె ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు రాకుండా జాగ్రత్త పడింది. అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో తాను అతనిని పెళ్లి చేసుకుంటున్నాను అనే విషయాన్ని వెల్లడించి అందరికీ ఒక రకమైన షాక్ ఇచ్చింది.

అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటికే ఆమె చేసిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఆమె చేస్తున్న ఇతర సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో నాగార్జున సరసన ఘోస్ట్ సినిమాలో నటించాల్సి ఉండగా ప్రెగ్నెన్సీ నేపథ్యంలో తప్పుకుందని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఆ విషయం ఖరారు అయినట్లు అయింది. అలాగే కమల్ హాసన్ హీరోగా చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా ఎప్పుడు పునప్రారంభం అవుతుందో తెలియని నేపథ్యంలో ఆమె ఆ సినిమా నుంచి తప్పకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఆమె నటించిన ఆచార్య, మూడు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా మరో హిందీ సినిమా ఉమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read : Tollywood : నిర్మాతలు అలెర్ట్ గా లేకపోతే అంతే

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet