iDreamPost
android-app
ios-app

JC Prabhakar Reddy, Accident – జేసీ కాన్వాయ్‌కి ప్రమాదం.. జేసీ సేఫ్‌ కానీ..

JC Prabhakar Reddy, Accident – జేసీ కాన్వాయ్‌కి ప్రమాదం.. జేసీ సేఫ్‌ కానీ..

మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. జేసీ కాన్వాయ్‌లోని ఓ కారు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ దిమ్మెను ఢీ కొనడంతో నలుగురుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుత్తి జాతీయ రహదారిపై అనంతపురం వెళ్లే వైపున కాసేపల్లి టోల్‌ప్లాజా వద్ద జరిగింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని అతికష్టం మీద కారు నుంచి తీసిన టీడీపీ శ్రేణులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఎయిడెడ్‌ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్ధతు తెలిపేందుకు, వారితో ముఖాముఖి నిర్వహించేందుకు లోకేష్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైదారాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన అనంతపురం వెళ్లారు. జిల్లా సరిహద్దు వద్ద లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు.. టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డి తన అనుచరులతో భారీ కాన్వాయ్‌తో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాసేపల్లి టోల్‌ప్లాజా వద్ద ఇరుగుపల్లికి చెందిన ఆదినారాయణ రెడ్డితోపాటు మరో ముగ్గురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్‌ దిమ్మెను ఢీకొంది. అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి సీటుకు, స్టీరింగ్‌కు మధ్య ఇరుక్కుపోయారు. డ్రైవింగ్‌ సీటు పక్కనే కూర్చున్న వ్యక్తి.. తల కారు అద్ధంలో ఇరుక్కుపోయింది. తల కారు బయట, ఇతర శరీరం కారు లోపల ఉంది. ఈ ఘటన వల్ల.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు.

Also Read : Petrol Prices, Sajjala – సజ్జల ప్రతిపాదన ఉభయతారకం

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş