Idream media
Idream media
సాయిబాబా మంత్రదండం కన్నా మోదీ మంత్రదండం పవర్‌ఫుల్ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం అయన అనంతపురం జిల్లా గుత్తి లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుకోవడం, జగన్‌పై నరేంద్ర మోదీ దయ ఉండడం వల్లనే భారీ మెజారిటీ వచ్చిందన్నారు. జగన్ పాలన గురించి ఇప్పుడు ఏమి చెప్పినా తప్పే అనిపిస్తుందని, ఏడాది గడిస్తే ఏది చెడో, ఏది మంచో తెలుస్తుందన్నారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదన్నారు. తన మనసుకు తోచిన విషయాలే చెబుతానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కులాలు, మతాలు, బంధుత్వాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. పోలీసు కేసుల భయంతోనే కొందరు వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.