iDreamPost
iDreamPost
ట్రైలర్ కన్నా ముందు పెద్దగా అంచనాలు లేకుండా కేవలం ఆసక్తిని మాత్రమే రేపిన జాతిరత్నాలు నిన్న అనూహ్యంగా ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. మౌత్ టాక్ తో పాటు రివ్యూస్ కూడా అధిక శాతం పాజిటివ్ గా రావడంతో ఈవెనింగ్ షోస్ నుంచి పికప్ డబుల్ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో సెకండ్ షో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కామెడీనే నమ్ముకుని లాజిక్స్ ని పూర్తిగా పక్కనబెట్టేసి దర్శకుడు అనుదీప్ చేసిన ప్రయత్నానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా జాతి రత్నాలు ఇప్పటికైతే ఫస్ట్ ప్లేస్ తీసుకుంది.
ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు జాతిరత్నాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల 84 లక్షల షేర్ దక్కించుకుంది. గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఇది 8 కోట్లకు పై మాటే. ఈ కోణంలో చూసుకున్నా ఇవి ఎక్స్ పెక్ట్ చేయని నెంబర్లు. బిసి సెంటర్లలో సైతం ఇదే జోరు కనిపిస్తుండటం విశేషం. శ్రీకారం, గాలి సంపత్ లు గట్టి పోటీగా నిలుస్తాయనుకుంటే వాటిని డామినేట్ చేసేలా ప్రస్తుతానికి జాతిరత్నాలు బుకింగ్ సాక్ష్యంగా నిలుస్తోంది. నైజామ్ లోనే కోటిన్నర దాకా రాబట్టిన ఈ ఎంటర్ టైనర్ కు స్క్రీన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏరియావారీగా చూసుకుంటే వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి
– ఏరియా వారీగా జాతిరత్నాలు మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 1.42cr |
సీడెడ్ | 0.57cr |
ఉత్తరాంధ్ర | 0.45cr |
గుంటూరు | 0.39cr |
క్రిష్ణ | 0.248cr |
ఈస్ట్ గోదావరి | 0.32cr |
వెస్ట్ గోదావరి | 0.2803cr |
నెల్లూరు | 0.20cr |
Total Ap/Tg | 3.94cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.08cr |
ఓవర్సీస్ | 0.82cr |
ప్రపంచవ్యాప్తంగా | 4.84cr |
గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వీకెండ్ దొరకడం జాతిరత్నాలుకు చాలా కలిసి రాబోతోంది. ఇవాళ కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. రేపు ఎల్లుండి హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం లేదు. లాజిక్స్ లేని కామెడీ మేజిక్ కి జనం గట్టిగా కనెక్ట్ అయ్యారని ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. ఒక వేళ ఇదే జోరు కొనసాగిస్తే థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 11 కోట్ల మొత్తం రెండో వారం అడుగుపెట్టే లోపే తెచ్చేసుకోవవచ్చు. మరోపక్క శ్రీకారం చెప్పుకోదగ్గ పోటీ ఇస్తుండగా గాలి సంపత్ చాలా వీక్ గా కనిపిస్తోంది. సోమవారానికి వీటికి స్టేటస్ లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వస్తుంది