iDreamPost
android-app
ios-app

ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నా రాజకీయ విమర్శలేనా?

ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నా రాజకీయ విమర్శలేనా?

కొన్ని వేల మందికి ప్రజా ప్రతినిధి గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఓ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా సరే ఆయా సమస్యల మీద అడగవచ్చు ప్రశ్నించవచ్చు.. ఎక్కడ సమస్య ఉందో ఆయన దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు. దానికోసమే ఆయనకు ప్రజాధనం నుంచి ప్రభుత్వం వేతనాలకు సైతం ఇస్తుంది. అయితే దీనికో పద్ధతుంది… సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే విధానం ఉంది.. అలా కాకుండా కొన్ని వేల మందికి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేను బహిరంగంగా ఇష్టానుసారం మాట్లాడటం, ఏరా పోరా అని రఫ్ గా మాట్లాడటం ప్రశ్నించటం అవ్వదు.

సంక్రాంతి నిమిత్తం పండుగ కోసం గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే కారును ఆపి బూతులు మాట్లాడుతూ సమస్య మీద మాట్లాడుతున్నాం అని సమర్ధించుకోవడం ఏం సంప్రదాయం..? ఓ ఎమ్మెల్యేకు సమస్యను విన్నవించడం అంటే బూతులు మాట్లాడుతూ, తిడుతూ అడగటమా? వారిని తిడుతున్న ఎలాంటి పట్టింపులు, ఆత్మభిమానం ఉండకూడదా? సమస్య పరిష్కరించడం అంటే ఎమ్మెల్యే చేతుల్లో అల్లవుద్దీన్ దీపం ఉంటుందా..?? ఒకసారి ఆలోచించాల్సిన అంశాలు.

ఏం జరిగిన ఎమ్మెల్యే బాధ్యతేనా?

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఇటీవల సంక్రాంతి సందర్బంగా ఓ గ్రామం లో పర్యటనకు వెళ్ళినపుడు జనసేన పార్టీ కు చెందిన ఓ కార్యకర్త ఆయన వాహనాన్ని అడ్డుకోవడం, బూతులు మాట్లాడుతూ ఏకవచనం వినియోగిస్తూ ఎమ్మెల్యేను సంభోదించడం… దానికి ఎమ్మెల్యే సైతము ఘాటుగా ప్రతిస్పందించడం జరిగాయి. అయితే ఎమ్మెల్యేలు ప్రశ్నించిన సదరు కార్యకర్త వెంకట నాయుడు సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం కు బానిసైన అఅతడిని తాగవద్దని ఇంట్లోని వారు వారించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే, దానికి జనసేన పార్టీ ఇప్పుడు రాజకీయ రంగు పులుముతోంది.

కుటుంబం చెప్పేది వినరా?

ఆత్మహత్యకు సరిగ్గా మూడు రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే తో జరిగిన సంవాదమే వెంకట నాయుడు ఆత్మహత్యకు కారణమంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసేశారు. అసలు ఏం జరిగిందో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యుడిని చేస్తూ ఓ పార్టీ అధ్యక్షుడు ప్రెస్ నోట్ విడుదల చేయడం కాస్త విచిత్రమే.

అయితే ఆత్మహత్య చేసుకున్న వెంకట్ నాయుడు కుటుంబ సభ్యులు మాత్రం తమను ఎవరూ బెదిరింపులు, ఒత్తిళ్లు పెట్టలేదని మద్యం అలవాటు అయితే వెంకట నాయుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాకు చెప్పారు. ఎప్పటినుంచో మద్యం అలవాటుకు బానిసగా మారిన వెంకట నాయుడు అదే మత్తు లో ఎమ్మెల్యేను అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్న మాట. మద్యం మత్తులోనే ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడారని బూతులు ఉపయోగించారని స్థానికులు చెబుతున్నారు.కుటుంబ సభ్యులు సైతం వెంకట నాయుడు మద్యానికి ఎక్కువగా పనిచేయడం కుటుంబ సభ్యులు పిల్లలను సైతం పట్టించుకోవడం లేదని దీనిపై గట్టిగా వారించడంతో పురుగు మందు తాగడని నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తూ ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు.

ఎవరీ వెంకట్ నాయుడు?

జనసేన పార్టీ జెండా పట్టుకుని ఆ రోజు ఎమ్మెల్యేలు కారు అడ్డగించిన వెంకట నాయుడు గతంలో టీడీపీ కార్యకర్త గా పని చేశారని ఒక వాదన ఉంది. గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కు అసలు క్యాడర్ గాని బలం గాని లేదు.

2019 ఎన్నికల్లో 81 వేల ఓట్ల మెజారిటీతో జగన్ తరువాత రెండవ అత్యధిక మెజారిటీతో గెలిచిన అన్నా రాంబాబు… జనసేన పార్టీ తరఫున కనీసం డిపాజిట్ కూడా సాధించలేని ఓటింగ్ శాతం ఉన్న గ్రామాల్లో వెంకట నాయుడు వంటి వ్యక్తులు మద్యం మత్తులో మాత్రమే చేతికి వచ్చిన జెండా పట్టుకొని నానా హడావుడి చేయడానికి ప్రయత్నించారు అనేది స్థానికులు చెబుతున్న వాస్తవం. దీంతో అసలు వెంకట నాయుడు జనసేన కార్యకర్త లేక తెదేపా కార్యకర్త అనేది ఇప్పుడు ఆసక్తి కర కోణం.

ఏం జరిగినా ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సిన దేనా?

ఓ పండుగ నిమిత్తం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేలను సమస్య మీద అడగడం తప్పు లేదు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన పరిష్కారం చూపండి అంటూ ఒక వినతిపత్రం లేదా మౌఖికంగా చెప్పడమో ఆ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి చేయవచ్చు. అది పద్ధతి. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వాటిని జాగ్రత్తగా గమనిస్తే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును జనసేన పార్టీ కార్యకర్త గా చెబుతున్న వెంకట నాయుడు అప్పటికే పలు సార్లు దుర్భాషాలాడుతూ కనిపించింది. వీడియోలో ఎమ్మెల్యే మాటల్లో అప్పటికే జరిగిన సభలో సైతం సదరు వ్యక్తి అందరి ముందు బహిరంగంగా ఏరా పోరా అంటూ బూతులు మాట్లాడడంతో నే అన్నా రాంబాబు ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యారు. ఒక ఎమ్మెల్యేలు తిడుతూ సమస్యలు చెబుతున్నామని చెప్పిన వ్యక్తి తర్వాత ఏ కారణం చేత చనిపోయిన దానికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సింది నా అన్నది ఇప్పుడు ప్రశ్న.

ఇదేం శవ రాజకీయాలు!!

దీనిలో అసలు వివాదం లేదు. మద్యానికి బానిసై ఇంట్లోని వారు తిడితే ఆ మద్యం మత్తులో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది ఉన్నారు. ఇది చాలా సాధారణ నేర వార్త. అయితే ఓ పార్టీ జెండాను పట్టుకుని అంతమాత్రాన తమ కార్యకర్త గా చెప్పుకుని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోకుండానే ఎమ్మెల్యేని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమో…. ఇవేమీ శవరాజకీయాలు జనసేన పార్టీ అధ్యక్షుడు కే తెలియాలి.