iDreamPost
android-app
ios-app

Happy Birthday Balayya బాలయ్య అభిమానులకు డబుల్ బొనాంజా

  • Published Jun 09, 2022 | 3:36 PM Updated Updated Jun 09, 2022 | 3:36 PM
Happy Birthday Balayya బాలయ్య అభిమానులకు డబుల్ బొనాంజా

ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. మొదటిది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ని చిన్న టీజర్ తో పాటు ప్రకటించబోతున్నారు. దీనికి జై బాలయ్య, అన్నగారు, రెడ్డిగారు, వీరసింహారెడ్డి అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ ఫైనల్ గా ఏది లాక్ చేస్తారో ఇంకా సస్పెన్స్ గానే ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే కీలక భాగం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. కొత్త షెడ్యూల్ కర్నూలులో ఉండొచ్చు.

ఇక రెండో కానుక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోయే సినిమా తాలూకు గెటప్ ని రివీల్ చేస్తారట. టైటిల్ ఉండకపోవచ్చు కానీ పాత్ర ఎలా ఉండబోతోందన్న క్లూ దీని ద్వారా ఇవ్వబోతున్నారు. ఇందులో ఆయన సరసన ప్రియమణి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కూతురిగా నటించబోతున్నట్టు లీక్ ఉంది. ఇందులో బాలయ్యది డ్యూయల్ రోలా లేక సింగిలా అనేది తెలియాల్సి ఉంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తారా లేక అనిల్ కొత్త ఛాయస్ చూసుకుంటారా అనేది ఓపెన్ చేయలేదు. మొత్తానికి ఈ రెండు బొనాంజాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సినిమాలు కావడంతో వీటి మీద భారీ హైప్ ఉంది.

ఇక ఆహా కోసం చేయాల్సిన అన్ స్టాపబుల్ టాక్ షోకు సంబంధించిన అప్డేట్ కూడా జూన్ 10నే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సిరీస్ ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు. సెలబ్రిటీలను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారట. మొత్తానికి బాలయ్య పుట్టినరోజుని పండగలా జరిపేందుకు దర్శక నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారు. ఇదంతా ఓకే కానీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏమైనా చెబుతారేమోని ఎదురు చూస్తున్న ప్రతిసారి అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. అసలు తన డెబ్యూని ఎలా ప్లాన్ చేశారో కూడా తెలియదు. కనీసం ఫలానా సంవత్సరం లాంటివి ఈసారైనా బాలకృష్ణ చెబుతారేమో చూద్దాం

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş