iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యంపై సీఎం జగన్ సర్కార్ ప్రత్యక దృష్టి పెట్టి ఇప్పటికే పలు విప్లవాత్మకమైన కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా భవిష్యత్ లో పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే వారికి నాణ్యమైన విద్య ఒక్కటే మార్గం అని, నా రాష్ట్రంలో పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి మెరుగైన విద్య మాత్రమే అని ఇప్పటికే సీఎం జగన్ పలు సందర్భాల్లో ప్రకటించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లలో స్కూల్ బ్యాగ్ తో పాటు మూడు జతల యూనిఫామ్స్, 1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్ తో పాటు పుస్తకాలు అందిస్తుంది. జగన్ సర్కార్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి వర్క్ బుక్స్ కూడా అందజేయడం విశేషం. యూనిఫాం కుట్టు కూలీ కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వార ప్రభుత్వ పాఠశాలలని కార్పోరేట్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అమ్మఒడి అంటు పిల్లలను బడిబాట పట్టేలా విప్లవాత్మకమైన పధకాలను ప్రవేశ పెట్టారు. విద్యార్ధులు ఆరోగ్యంగా ఉండేలా వారికి జగన్ అన్న గోరు ముద్ద ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇక తాజాగా రాష్ట్రంలో 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులకు తమకు ఆసక్తి ఉన్న వృత్తుల గురించి తెలుసుకుని అందుకనుగుణంగా కృషి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు యునిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. విద్యార్థులు తమ గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్‌లతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన కెరీర్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ వెబ్‌సైట్‌లో మొత్తం 555పైగా కెరీర్‌లు, 21వేల పాఠశాలల వివరాలు, 1,150 ప్రవేశ పరీక్షల సమాచారం, 1,500కుపైగా ఉపకార వేతనాల వివరాలను పొందుపరిచారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకునేందుకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తారు. జగన్ సర్కార్ తీసుకుని వచ్చిన ఈ కార్యక్రమం విద్యార్ధుల భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు .