iDreamPost
android-app
ios-app

ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా జాస్తి చలమేశ్వర్ తనయుడు

  • Published Dec 09, 2020 | 3:15 PM Updated Updated Dec 09, 2020 | 3:15 PM
ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా జాస్తి చలమేశ్వర్ తనయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ న్యాయవిభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది , సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తనయుడు జాస్తి నాగ భూషణ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ను అనుసరించి ఈ నియామకాన్ని జరిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో 329ని విడుదల చేసింది.