Idream media
Idream media
ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్మో హన్ రెడ్డి. ఆర్థిక నిపుణుల సూచనలకు అనుగుణంగా మార్కెట్లో డబ్బు చలామణి అయ్యేలా చేస్తూ రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కరోనా కాలంలోనూ నగదు బదిలీ వంటి పథకాల ద్వారా ప్రజలకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తలేదు. ఫలితంగా నికర ఆర్థికాభివృద్దిలో రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జగన్ పథకాలు పాలనపై జాతీయ స్థాయిలో మంచి స్పందన వస్తోంది.
ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచిందని ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యూకేషన్ వెల్లడించింది. అలాగే, నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ఏపీలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బ్రహుమతి గ్రహీత బాలల హక్కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు.
కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆస్పత్రులను నిర్మించాలన్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. ఏపీలో 17005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. నీతి అయోగ్ కూడా ఏపీ సర్కార్ కు కితాబిచ్చింది. కరోనా సమయంలో పేదలకు అందుతున్న వైద్యంపై నీతి అయోగ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఇలా ఏపీ సీఎం జగన్ తన పాలన ద్వారా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో జగన్ పాలనలో జరుగుతున్న పరిణామాలను ప్రతీ రాష్ట్రం నిశితంగా పరిశీలిస్తోంది. తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.