iDreamPost
iDreamPost
ఏపీ సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డి విదేశాలకు పయనమయ్యారు. ఉన్నత విద్యకోసం ఆమె పారిస్ బయలుదేరారు. బెంగళూరులో ఆమెకు కుటుంబ సభ్యులు సెండాఫ్ ఇచ్చారు. సుప్రసిద్ధ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె వెళ్లారు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ సమయం తర్వాత బెంగళూరు వెళ్లి కుమార్తెకి వీడ్కోలు పలికారు.
గతంలో లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన హర్షా తన ప్రతిభతో ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూళ్లలో నెంబర్ త్రీ గా ఉన్న ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈ మేరకు బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ వైఎస్ జగన్ కుమార్తెకు అభినందనలు చెబుతూ, ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే వివిధ దేశాల ప్రతినిధుల కలిశారు. బ్రిటన్ సహా పలు దేశాల ప్రతినిధులు కోవిడ్ నియంత్రణ విషయంలో కూడా జగన్ ని అభినందించారు. బ్రిటన్ కి చెందిన డిప్యుటీ హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఏపీ అనుభవాలను ప్రస్తావించిన సందర్భం కూడా ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల కాన్సులేట్ ప్రతినిధులు నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి అభినందించి వెళ్లారు. అంతకుముందు విజయవాడలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 12 దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రిగా జగన్ పనితీరుకి ఇప్పటికే పలువురు ప్రముఖల నుండి అభినందనలు రాగా తాజాగా జగన్ కుమార్తెకు సైతం విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నందున పలువురు నుండి అభినందనలు అందుకోవడం హర్షించదగ్గ విషయం. ఆమె ఇంకా ఉన్నత స్థాయి కి ఎదగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ హర్షా .