iDreamPost
android-app
ios-app

కరోనా మరణాలు – చైనాను దాటేసిన ఇటలీ

  • Published Mar 20, 2020 | 1:05 PM Updated Updated Mar 20, 2020 | 1:05 PM
కరోనా మరణాలు – చైనాను దాటేసిన ఇటలీ

చైనాలో పుట్టి అక్కడ వేలాదిమందిని పొట్టన పెట్టుకున్న కరోన వైరస్ ఇప్పుడు ఇటలీ దేశం పై పడింది . గడిచిన 24 గంటల్లో ఇటలీలో అత్యధికంగా 475 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం . వ్యాది పుట్టిన చైనా దేశంలోకూడా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించిన దాఖలాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నేటి వరకు చైనా లో కరోనా వైరస్ సోకడం వలన మరణించన వారి సంఖ్య 3,242 ఉండగా ఇటలీ మాత్రం కరోనా వైరస్ మరణాల్లో చైనా దేశాన్ని సైతం వెనక్కు నెట్టి 3,405 గా నమొదైంది. ఇటాలియన్ సివిల్ ప్రొటెక్షన్ ఏజన్సీ ప్రకటించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇటలీలో కరోన వైరస్ సోకి బాధపడుతున్న వారి సంఖ్య 41,035 వరకు చేరడంతో ఇప్పటికే ఆ దేశం హెల్త్ ఏమర్జన్సి ప్రకటించింది.

ఇక ప్రపంచ వ్యాతంగా కరోన వైరస్ సోకడం వలన మరణించిన వారి సంఖ్య 10వేలకు చేరగా భాదితుల సంఖ్య 22 లక్షల 40వేలు దాటింది. చైనా తరువాత ఇటలీ , ఇరాన్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తునట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక భారత్ దేశానికి వస్తే ఇప్పటికే కరోనా వలన 5గురు మరణించగా వ్యాది సోకిన వారి సంఖ్య 198 గా నమోదైంది.