iDreamPost
android-app
ios-app

రాంకీ గ్రూపు సంస్థలపై ఐటి దాడులు..

  • Published Jul 06, 2021 | 8:03 AM Updated Updated Jul 06, 2021 | 8:03 AM
రాంకీ గ్రూపు సంస్థలపై ఐటి దాడులు..

ఆదాయపుపన్ను శాఖ అధికారుల కన్ను రాంకీ గ్రూపు సంస్థలపై పడింది. ఒకేసారి 15 బృందాలతో దాడులకు పూనుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈ సంస్థకు చైర్మన్ కావడం విశేషం. దాంతో తాజా ఐటి దాడులు ఆసక్తిని రేపుతున్నాయి. రెండు వారాల క్రితం టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఆర్థిక వ్యవహారాలపై ఐటి దాడులు జరిగాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎంపీ కంపెనీల మీద దాడులు సాగుతుండడం విశేషం.

హైదరాబాద్ లో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి నివాసంలో సోదాలలో భాగంగా కీలక సమాచారం సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడే ఉన్న రాంకి ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు చేస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా 1994లో ప్రారంభించిన రాంకీ వివిధ అనుబంధ సంస్థలతో విస్తరించింది. ఇన్ఫ్రా, ఇంజినీరింగ్, ఎస్టేట్స్ అండ్ ఫార్మ్, లైఫ్ సైన్స్ రంగాల్లో రాణిస్తోంది. తెలుగు పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరిగా అయోధ్య రామిరెడ్డి ఎదిగారు. వైఎస్ హయాంలో భూకేటాయింపుల విషయంలో అయోధ్య రామిరెడ్డిని కూడా జగన్ అక్రమ కేసుల్లో ఇరికించారు. తాజా ఐటి దాడుల వ్యవహారం అటు పారిశ్రామిక వర్గాలతో పాటుగా ఆయన ఎంపీగా ఉండడంతో రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవి రెగ్యులర్ సోదాలుగానే కొందరు చెబుతున్నారు.

Also Read : క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప హత్య కేసు ఖైదీలకు బెయిల్