iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా వేసుకున్న పెద్ద సినిమాల దురదృష్టాన్ని చిన్న సినిమాలు తమకు అవకాశంగా మలుచుకోవడం మొదలయ్యింది. మొత్తం మూడు భారీ చిత్రాలు లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వంలు పోస్ట్ పోన్ కావడంతో ఖాళీ అయిన ఆ స్లాట్లు మీడియం బడ్జెట్ నిర్మాతలకు వరంగా మారాయి. రేపు ఏ పోటీ లేకుండా వర్మ దెయ్యం లాంటివి రానుండగా ఆపై వారం తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ 23న థియేటర్లలో అడుగు పెడుతోంది. నాని మూవీ స్థానంలో రానుండటంతో ఓపెనింగ్స్ పరంగా టీమ్ మంచి నమ్మకంగా ఉంది. ఇందాకే సాయి తేజ్ తో టీజర్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. దాని విశేషాలేంటో చూద్దాం
అనగనగా ఒక ప్రేమ జంట. వైజాగ్ నగరంలో కబుర్లు చెప్పుకుంటూ తమ భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉంటారు. అమ్మాయి పుట్టినరోజుకు అబ్బాయి ఓ స్పెషల్ ట్రీట్ కూడా ప్లాన్ చేస్తాడు. అయితే అప్పుడే ఊహించని పరిణామం ఎదురవుతుంది. దీంతో ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరూ ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. క్షణక్షణం ప్రమాదాలు వెన్నాడుతాయి. మరి ఈ పద్మవ్యూహం నుంచి వాళ్లిద్దరూ ఎలా బయట పడ్డారు అనేదే ఇష్క్ కథ. నాట్ ఏ లవ్ స్టోరీ అని ముందే ట్యాగ్ లైన్ లో చెప్పేశారు కాబట్టి మాములు ప్రేమకథనే అభిప్రాయం అవసరం లేదు. ఏదో థ్రిల్లర్ లా కనిపిస్తోంది.
జాంబీ రెడ్డితో డీసెంట్ హిట్ అందుకున్న తేజ సజ్జ ఇందులో లవ్ బాయ్ గా డిఫరెంట్ గా చేసినట్టు కనిపిస్తోంది. ఎమోషన్స్ ని కూడా సబ్జెక్టు డిమాండ్ చేసినట్టు ఉంది. ఆ మధ్య కన్నుగీటుతో సెన్సేషన్ సృష్టించిన ప్రియా వారియర్ కు ఇందులో ఫుల్ లెన్త్ రోల్ దక్కింది. చెక్ లో తేడా అనిపించింది కానీ ఇందులో లుక్స్ బాగున్నాయి. కాకపోతే తేజలో ఇంకా లేత టీనేజ్ ఛాయలు ఎక్కువగా ఉండటంతో ప్రియా వారియరే కాస్త పెద్దగా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీ 23న విడుదల కాబోతోంది
Trailer Link @ https://bit.ly/3e2NnAh