iDreamPost
android-app
ios-app

పవన్ సినిమా ఇంకా ఎంత రాబట్టాలి

  • Published Apr 18, 2021 | 7:11 AM Updated Updated Apr 18, 2021 | 7:11 AM
పవన్ సినిమా ఇంకా ఎంత రాబట్టాలి

దిగ్విజయంగా రెండో వారంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నెమ్మదించింది. మొదటి అయిదారు రోజులు లాంగ్ వీకెండ్ తో పాటు ఉగాది సెలవులను పూర్తిగా వాడుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా 80 కోట్ల దాకా షేర్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్. బ్రేక్ ఈవెన్ రీచ్ కావడానికే ఇంకా 10 కోట్ల దాకా రావాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంత ఈజీగా కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనాలు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు. పవన్ మూవీ కాబట్టి ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చింది కానీ ఇతర హీరోలకు ఇంత కలెక్షన్ వస్తుందా అంటే అనుమానంగానే ఉంది. అందుకే ఒక్కొక్కరు తమ రిలీజులను వాయిదా వేసుకున్నారు.

నిన్న ఈ రోజు కొత్త వీకెండ్లో  వకీల్ సాబ్ ఎంత రాబట్టుకుంటాడు అనే దాని మీదే సేఫ్ అవ్వడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది. కొన్ని చోట్ల టికెట్ రేట్ల రాద్ధాంతం వసూళ్ల మీద ప్రభావం చూపించింది. సరైన సినిమాలు లేక ఆంధ్రలో కొన్నిచోట్ల థియేటర్లు తాత్కాలికంగా మూసివేయడం కూడా ఇన్ డైరెక్ట్ గా వకీల్ సాబ్ రన్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పుడు ఇంకో పది కోట్లకు పైగా షేర్ వస్తేనే బయ్యర్లు లాభపడినట్టు. లేదా నష్టాలు తప్పవు. నైజామ్ లాంటి ప్రధాన కేంద్రాల్లో ప్రాఫిట్స్ వచ్చాయి కానీ అన్ని చోట్లా ఇదే పరిస్థితి లేదు. అందుకే దిల్ రాజు నిన్నటి నుంచి ఫ్రెష్ గా మళ్ళీ కొత్త ప్రమోషన్లు మొదలుపెట్టారు.

అసలు పోటీ అనేదే లేకపోవడం వకీల్ సాబ్ ముందున్న అతి పెద్ద సానుకూలాంశం. ఇవాళ ఆదివారమే అయినప్పటికీ మరీ హౌస్ ఫుల్ అయ్యేంత అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతానికి లేవు. కరెంట్ బుకింగ్ మీదే ఎక్కువ రెవిన్యూ వస్తోంది. కరోనా పాజిటివ్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లు తదితర ఈవెంట్లకు రాకపోవడం ఒకరకంగా మైనస్సే. ఎలా చూసుకున్నా ఒక రీమేక్ సినిమాకు ఈ స్థాయి లెక్క రావడం విశేషమే. అయితే గోపాల గోపాల తరహాలో టాక్ ఎంత పాజిటివ్ గా ఉన్నా అద్భుతాలు చేసి ఇండస్ట్రీ హిట్ దక్కించుకునే రేంజ్ లో వకీల్ సాబ్ ఉండబోవడం లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది