iDreamPost
android-app
ios-app

Akhanda : బాలయ్య బ్లాక్ బస్టర్ సీక్వెల్ – ఛాన్స్ ఉందా

  • Published Dec 08, 2021 | 10:51 AM Updated Updated Dec 08, 2021 | 10:51 AM
Akhanda : బాలయ్య బ్లాక్ బస్టర్ సీక్వెల్ – ఛాన్స్ ఉందా

వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల షేర్ ను అందుకున్న అఖండ స్పీడుకి ఈ వారం కూడా బ్రేకులు పడటం కష్టంగానే ఉంది. పేరుకు 8 సినిమాలు రిలీజవుతున్నప్పటికీ లక్ష్య తప్ప ఇంకేదీ కనీస అంచనాలు మోయలేకపోతుండటంతో వీకెండ్ కూడా బాలయ్య కంట్రోల్ లోకి వెళ్లడం ఖాయమనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా అఖండకు సంబంధించి రెండు కీలకమైన అప్ డేట్స్ ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తున్నాయి. అందులో మొదటిది సీక్వెల్. సినిమాను ముగించిన విధానం కొనసాగింపుకు ఆస్కారం కలిగించింది. తోడబుట్టిన వాడి కూతురు ఎప్పుడు పిలిచినా వస్తానని అఘోరా చెప్పాడు కాబట్టి నెక్స్ట్ పార్ట్ ని ఈ సెంటిమెంట్ డ్రామాతో నడిపించొచ్చు.

కానీ ఇదంత సులభం కాదు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలి. అఖండ ప్రమోషన్లు కాగానే ఆ పనిలో ఉంటారు. ఇదయ్యాక అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడే 2022 గడిచిపోతుంది. ఆలోగా బోయపాటి శీను వేరే హీరోతో ఇంకేదైనా మూవీ ప్లాన్ చేస్తారో లేదో తెలియదు. సో సీక్వెల్ గురించి ఇప్పటికిప్పుడు ఆశలు అంచనాలు పెట్టేసుకోవడం కరెక్ట్ కాదు. అందులోనూ ఫస్ట్ పార్ట్ తో పెరిగిన అంచనాలను మ్యాచ్ చేయడం తేలిక కాదు. మెయిన్ విలన్లు చచ్చిపోయారు. కొత్త వాళ్ళను తీసుకురావాలి. కథ ఇంకా బలంగా సెట్ చేసుకోవాలి. దీనికి చాలా టైం అవసరం పడుతుంది.

ఇక రెండో వార్త అఖండ ఓటిటి రిలీజ్ గురించి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ తో 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ఒప్పందం మీద డీల్ చేశారట. అంటే కొత్త సంవత్సర కానుకగా జనవరి 1 లేదా 2న వచ్చే అవకాశం ఉంది. అప్పటికంతా ఫైనల్ రన్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి కలెక్షన్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అందులోనూ 7న ఆర్ఆర్ఆర్ ఉంటుంది కాబట్టి సంక్రాంతి హడావిడిలో డిజిటల్ రిలీజ్ చేయడం కన్నా న్యూ ఇయర్ ని బెస్ట్ ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఓటిటిలోనూ అఖండకు భారీ స్పందన దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ప్రస్తుతం ఫ్యాన్స్ చూపు 100 కోట్ల గ్రాస్ ఎప్పుడు టచ్ అవుతుందాని

Also Read : Thank You Movie : చైతు సినిమా రిలీజ్ క్లారిటీ

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet