iDreamPost
android-app
ios-app

Jr ntr – మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే.. జూనియర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Jr ntr – మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే.. జూనియర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కన్నీటి గాధలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో నా భార్య భువనేశ్వరిని అవమానించారు అంటూ వైసీపీ నేతల మీద చంద్రబాబు పెద్ద ఎత్తున అభాండాలు వేశారు. అసెంబ్లీ రికార్డులు సహా ఏ వీడియోలో కూడా భువనేశ్వరి పేరు ప్రస్తావించకపోయినా తన భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. చంద్రబాబు కేవలం సింపతి కోసమే ఇలా ఏడుస్తున్నారు అని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అందరూ చెబుతూ వస్తున్నా ఏ మాత్రం వెనక్కి వెళ్లకుండా అదే జపాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే ముందుగా ఈ ఘటన జరిగిన తర్వాత టీడీపీ నేతలు కొంతమంది స్పందించారు కానీ నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా స్పందించక పోవడం ఆసక్తికరంగా మారింది..

సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున దుమారం రేగడంతో తెల్లవారే సరికి నందమూరి కుటుంబం అంతా బాలకృష్ణ ఇంటికి చేరుకొని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భువనేశ్వరికి తాము అండగా ఉంటామని కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని చెప్పుకొచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లో కనిపించకపోయేసరికి టీడీపీ అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అంటూ ఆయనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో విడుదల చేసి ఇలాంటి రాజకీయం చేయడం సరికాదని చెబుతూ కుటుంబాలను, ఆడ వాళ్లను రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు. ఇదే వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ తాను ఆ కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని చెబుతూ ఒక భర్తగా ఒక తండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పారు. అసలు ఈ వీడియో విడుదల చేసి మాట్లాడటమే గొప్ప అని టిడిపిలో ఒక వర్గం వాదిస్తుంటే వీడియో విడుదల చేసినా ఆ కుటుంబ సభ్యుడిని అని చెప్పకపోవడం ఏంటి అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటివరకు సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ చర్చ వర్ల రామయ్య దీక్షతో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చేరింది. చంద్రబాబు భార్యను అవమానించారని చెబుతూ నాలుగైదు రోజుల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ తాజాగా ఒక 12 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షలో  వర్ల మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి మీద కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని, మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలు వదులుకుంటారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. సినిమా రిలీజ్ కు ఉంది కాబట్టి భయపడ్డాడు అనుకోవడానికి బాలకృష్ణ సినిమా కూడా ఉంది ఆయనకు ఉన్న ధైర్యం ఎన్టీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. మొత్తం మీద ఎన్టీఆర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.

Also Read : BJP, Somu Veerraju, Donations, Flood Victims – మీరు చేయాల్సిన పని ఇది కాదు సోము వీర్రాజు గారు..!