iDreamPost
android-app
ios-app

టీడీపీ బూతు పంచాంగం – రాజకీయ ప్రణాళికలో భాగమేనా?

  • Published Sep 19, 2021 | 1:23 AM Updated Updated Sep 19, 2021 | 1:23 AM
టీడీపీ బూతు పంచాంగం – రాజకీయ ప్రణాళికలో భాగమేనా?

అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా బూతుల మోతమోగిస్తున్న తెలుగు తమ్ముళ్లు .

రాజకీయ నాయకుల్లో కొందరు దూకుడుతనం ప్రదర్శించడం అప్పుడప్పుడూ ఆవేశంలో కొంత అదుపు తప్పి బూతులు వాడటం చూస్తూనే ఉన్నాం . ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు . కానీ ఇటీవలి కాలంలో చాలామంది టీడీపీ నేతలు రిపోర్టర్లు రాయలేని , జర్నలిస్ట్స్ ఉదహరించలేని , న్యూస్ రీడర్స్ చెప్పలేని , డిబేట్స్ నిర్వాహకులు పలకలేని స్థాయిలో బూతులు వాడుతున్నారంటే అతిశయోక్తి కాదు .

ఇప్పుడే కాదు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్షాల పై టీడీపీ నాయకులు తీవ్రమైన బూతు పదజాలంతో విరుచుకుపడ్డ ఘటనలు కోకొల్లలు . ఏ అంశం పైన అయినా చర్చ జరుగుతున్నప్పుడు సమాధానం చెప్పలేని దశలో కానీ , ఏదైనా సమస్య పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు జరిగిన సందర్భంగా కానీ వాటి అణచివేతకు టీడీపీ ఎంచుకునే మార్గం బూతులతో విరుచుకు పడడం , బల ప్రయోగంతో అణిచివేయడం …

Also Read: పంజాబ్ కొత్త సీఎం ఎవరు?

టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్ మొదలుకొని బొండా ఉమా , బుద్దా వెంకన్న , చింతమనేని , అచ్చెన్నాయుడు , జేసీ ప్రభాకర్ , సహా పలువురు నేతలు జగన్మోహన్ రెడ్డిని , వైసీపీ నేతల్ని , పలువురు ఇతర పార్టీల వాళ్ళని పార్టీ మీటింగ్స్ లోనూ , బహిరంగ సభల్లోనే కాక సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా తిట్టిన సందర్భాలు కోకొల్లలు .

కాపు ఉద్యమ సందర్భంగా ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడని అరెస్ట్ చేయమని పోలీసు అధికారులకు ఫోన్ చేసిన లోకేష్ ఆ ల…. కొ….. ని తన్నండి అని ఆదేశించినట్లు పలు కధనాలు వెలువడ్డాయి . ఒక సందర్భంలో టీడీపీ కార్యకర్తలతో వైసీపీ ఆరోపణల గురించి మాట్లాడుతూ బురద జల్లితే కడుక్కొంటూ కూర్చోవాలా అందుకే ఆ నాకొడుకుల్ని తన్నామన్నాను అనటం గమనార్హం .

కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యి పలువురు మరణించగా కేసు సరిగ్గా విచారించకుండా , మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయకుండా తరలించే యత్నాన్ని నాటి ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకొని విచారణకు డిమాండ్ చేయగా ఆ ట్రావెల్ యజమాని అయిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి నడిరోడ్డు పై కూర్చొని జగన్మోహన్ రెడ్డిని నీచమైన పదజాలంతో దూషించడం జరిగింది .

Also Read: వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ

అసెంబ్లీలో పలు అంశాల పై , టీడీపీ అవకతవకలు పై అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న సందర్భంగా టీడీపీ నేతలు సమాధానం చెప్పలేని సందర్భాల్లో జగన్ సహా ఇతర వైసీపీ ఎమ్మెల్యేల పై బూతులతో దాడి చేయడం అలవాటుగా మార్చుకున్నారు . ఒకానొక దశలో ఏంట్రా నాకొడకా పాతేస్తా అంటూ బొండా ఉమా ఆవేశంతో ఊగిపోగా , మరోసారి తన పై చేసిన ఆరోపణలకు సమాధానమివ్వలేని అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి నీకు మగతనం ఉంటే , సీమ రక్తం ప్రవహిస్తుంటే , పౌరుషం ఉంటే నిరూపించు అంటూ నోరు పారేసుకొన్నాడు .

ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోని అధికార మదంతో జుట్టు పట్టుకుని లాగి ఇసుకలో పడేసిన చింతమనేని పై కనీస చర్యలు కూడా తీసుకోలేదు నాటి టీడీపీ ప్రభుత్వం . సరికదా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మహిళా అధికారిని పిలిపించుకుని మందలించి రాజీ చేయించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది . తర్వాతి రోజుల్లో చింతమనేని ఓ మీటింగ్లో మాట్లాడుతూ దళితులు మీకెందుకురా రాజకీయాలు పిచ్చి ముం… కొ….ల్లారా అని బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం …

ఇహ ఎన్టీఆర్ తనయుడు లోకేష్ మామ అయిన బాలకృష్ణ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు . పలు సందర్భాల్లో అభిమానులు , సామాన్య ప్రజలను తిట్టడమే కాక చామంది పై చెయ్యి చేసుకొని అల్లరిపాలైన బాలకృష్ణ ఓ మీటింగ్ సందర్భంగా ఏకంగా దేశ ప్రధాని మోడీని ఉద్దేశించి మా…. ..ద్ అంటూ తిట్టడంతో సభ్య సమాజం నివ్వెరపోయింది . అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు గర్వంతో జులుం ప్రదర్శించి విపక్షాల వారిని , సామాన్యుల్ని బూతులు తిట్టి అహంకారంతో వ్యవహరించగా అధికారం కోల్పోయాక అసహనం , ఆక్రోశాలతో వీరికి మరికొందరు తోడయ్యి బూతుల మోత మోగించసాగారు .

Also Read: అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!

సాక్షాత్తు బాబు తనయుడు భావి నేతగా పిలవబడుతున్న లోకేశ్ వైసీపీ నా కొ…. లు , చవటలు , దద్దమ్మలు అంటూ తిడుతుండగా , ఆ పార్టీ నేతలు పిల్లి మాణిక్యాల రావు , మరి కొందరు టీడీపీ జూమ్ మీటింగ్ల సాక్షిగా సభ్యసమాజం అస్సలు వినలేని అత్యంత జగుప్సాకరమైన పదజాలంతో తిట్టడం చూస్తే కేవలం బూతు భాష మాట్లాడటానికి వీరికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారా అనిపించక మానదు .

మొన్న కోడెల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు వాడిన భాష దిగజారుడుకి పరాకాష్ట …

దిక్కుమాలిన నా …. లు పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని , గాడిదలు వీళ్ళు ,చెత్త నా …. లు వీళ్ళు , పిచ్చి నా …. లు , బుద్ధి లేని నా కొ…. లు అంటూ ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రుల్ని బూతు పదజాలంతో దూషించిన చింతకాయల మహిళా హోంమంత్రిని , పోలీసు అధికారులని సైతం వదలకుండా తిట్టిపోసాడు . హోంమంత్రి సుచరితని ఉద్దేశించి నీకు సిగ్గూ లజ్జా లేదా , సిగ్గూ , లజ్జా , పౌరుషం ఉంటే రాజీనామా చెయ్యి అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించిన అయ్యన్న

కోడెల హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీ నా కొ…. లు కూడా సెల్యూట్ చేసేవారు అంటూ పోలీసు అధికారులను కూడా తిట్టిపోసి నేను తిట్టినందుకు నన్నేం పీకలేరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని వ్యాఖ్యానించడం చూస్తే అంతులేని అహంకారానికి నిలువెత్తు ప్రతిరూపం అనిపించక మానదు .

Also Read:తమిళనాడు గవర్నర్ గా మాజీ ఐపీఎస్.. స్టాలిన్ దూకుడుకు కళ్లెం వేసేందుకేనా.. ?

టీడీపీ నేతలు అనునిత్యం చేస్తున్న ఈ బూతు పారాయణం , వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తుంటే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వాన్ని , అధికారులని కవ్వించి , రెచ్చగొట్టి , అవమానించి కేసుల వైపు నడిపి , అరెస్టులు కావడం మళ్లీ వాటి పై ఆందోళనలతో గందరగోళ పరిస్థితులు నెలకొల్పి టీడీపీకి దూరం జరిగిన వర్గాల్లో , ప్రజల్లో సానుభూతి పొందడం అనే వ్యూహాన్ని అమలు చేస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .