iDreamPost
android-app
ios-app

నిత్యానంద కైలాసం పూర్తయిందా?

నిత్యానంద కైలాసం పూర్తయిందా?

పలు కేసులు చుట్టుముట్టడంతో విదేశాలకు పారిపోయిన వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి తాజా వీడియో సంచలనం సృష్టిస్తుంది. గతంలో కిడ్నాప్ ఆరోపణలతో పాటు ఆశ్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు పిర్యాదులు రావడంతో నిత్యానంద అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కానీ నిత్యానంద విదేశాలకు పారిపోవడంతో అరెస్ట్ చేయలేక పోయారు.

దేశం నుండి తప్పించుకున్న నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఒక దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టారని, ఆ దీవిని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరారని గతంలో వార్తలు వచ్చాయి.. కాగా పోలీసులు నిత్యానంద అరెస్టుకు ఇంటర్‌పోల్‌ పోలీసుల సహాయాన్ని కోరారు. కానీ పోలీసులు ఎంత ప్రయత్నించినా నిత్యానంద ఉన్న చోటుని కనిపెట్టలేకపోయారు.

కాగా నిత్యానంద తాజా వీడియో ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. ఆ వీడియోలో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని వెల్లడించాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది ఆశ్రమంలో ఖననం చేయాలని, అదే తన చివరి కోరిక అని అందులో తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.. నిత్యానంద దేశానికి తిరిగి రావడమేమో కానీ అతని ఆచూకీ మాత్రం పోలీసులకు చిక్కడంలేదు..

Jojobet GirişmeritbetbetsmoveCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobetganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet