iDreamPost
android-app
ios-app

నాగార్జున కోసం నాని రాబోతున్నాడా ?

  • Published Nov 19, 2020 | 12:11 PM Updated Updated Nov 19, 2020 | 12:11 PM
నాగార్జున కోసం నాని రాబోతున్నాడా ?

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 పడుతూ లేస్తూ ఇప్పటికి 70కి పైగా రోజులను పూర్తి చేసుకుంది. ఇంకొక్క నెల రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. గత మూడు సీజన్ల స్థాయిలో పార్టిసిపెంట్స్ కానీ గేమ్స్ కాని లేవనే కామెంట్స్ వస్తున్నప్పటికీ ఏదోలా మేనేజ్ అయితే చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల వల్ల వైల్డ్ కార్డు ఎంట్రీలను ఎక్కువ తెచ్చే అవకాశం లేకపోవడం కొంత మైనస్ అవుతున్నప్పటికీ స్పెషల్ ఎపిసోడ్స్ రూపంలో ఎంతో కొంత ఆ కొరతను తీర్చుకుంటున్నారు. సమంతా వచ్చినప్పుడు దసరా పండగ రోజు మంచి రేటింగ్ రావడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివే మరిన్ని ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం.

సీజన్ 2కి యాంకర్ గా చేసిన న్యాచురల్ స్టార్ నానితో ఒక సెపరేట్ ఎపిసోడ్ ప్లాన్ చేసే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. నాగార్జునతో నానికి మంచి రాపో ఉంది. దేవదాస్ లో కలిసి నటించినప్పటి నుంచి బాండింగ్ గట్టిగా ఏర్పడింది. ఆ చనువుతోనే నానిని నాగే స్వయంగా అడిగినట్టు తెలిసింది. అంతగా అడిగితే నాని కాదనలేడు కదా. అయితే ఇది దీని గురించి ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి న్యూస్ లేదు. వస్తే మాత్రం ఫ్యాన్స్ కి అంతకన్నా స్వీట్ న్యూస్ ఏముంటుంది. అది ఎప్పుడు ప్లాన్ చేస్తారనేది మాత్రం సస్పెన్స్. వచ్చే నెల షో పీక్స్ కు వెళ్తుంది కాబట్టి సరైన సమయం చూసి ఎంట్రీ ఇప్పించోచ్చు.

ఇదే కనక జరిగితే హౌస్ లో ఉన్న సభ్యులకు కూడా కిక్ వస్తుంది. నాని కాకుండా మరిన్ని సెలబ్రిటీ ఎంట్రీలు కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. భారీ రేటింగ్స్ మీద ఆశలు పెట్టుకుని బిగ్ బాస్ 4ని ప్లాన్ చేసుకున్న స్టార్ మా ఛానల్ కు ఈ విషయంలో గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. అందుకే ఈ ముప్పై రోజులు గట్టిగా టార్గెట్ చేస్తే నెక్స్ట్ సీజన్ కు హైప్ ని తెచ్చుకోవచ్చు. విన్నర్ ఎవరు అవుతారు అనేదాని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పోల్స్ మొదలయ్యాయి. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ విజేత ఎవరనేది మాత్రం అంత సులభంగా లీకయ్యేది కాదు.

marsbahis girişjojobetjojobet girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet giriş