బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా గల్లీబాయ్ కాపీ సినిమా అని తేల్చేసి ఆస్కార్ రేస్ నుంచి పక్కకి నెట్టేశారు. గతంలో మణిరత్నం తీసిన నాయకుడు సినిమా కూడా God Fatherకి ఇమిటేషన్ అని ఆస్కార్‌కి పరిగణించలేదు.
2002లో వచ్చిన 8 MILE అనే సినిమాకి గల్లీబాయ్ కాపీ అని తేల్చేశారు. బి-రాబిట్ అనే రాప్ గాయకుడు తన కెరీర్‌ని ఎలా నిర్మించుకున్నాడనేది కథ. కాలిఫోర్నియాలో తీసిన ఈ సినిమాకి Best Original Song ఆస్కార్ అవార్డు వచ్చింది. అందుకున్న వ్యక్తి ఈ సినిమా హీరో ఎమినమ్.
1995లో జరిగే ఈ కథలో హీరో పేదవాడు. తల్లి తాగుబోతు. గల్లీబాయ్‌లో కూడా హీరో పేదవాడు. తండ్రి ఎప్పుడూ తిడుతుంటాడు. రెండింటి కథ ఇంచుమించు ఒకటే. హీరో రాప్ గాయకుడిగా ఎదగడానికి చేసే పోరాటం.
8 MILE ప్రేరణగా తీసుకున్న , జోయాఅక్తర్ గల్లీబాయ్‌ని అద్భుతంగా తీశారు. 238 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇండియాలో పెద్ద హిట్. అయితే ఆస్కార్ కమిటీ విధివిధానాల ప్రకారం కాపీ సినిమాని పోటీకి తీసుకోరు.
3039