Idream media
Idream media
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈటెల రాజేంద్ర రాజీనామా చేసి బయటకు వెళ్ళిన తర్వాత ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరిగాయి. ఆ సామాజికవర్గం నుంచి తెలంగాణ క్యాబినెట్ లో ఎవరూ లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా చూశాయి. రాజకీయంగా తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గాని అలాగే రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లాల పరిధిలో గాని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గాని ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గాన్ని సీఎం కేసీఆర్ ఏ విధంగా దగ్గర చేసుకుంటారనేది కీలకంగా మారిన అంశం. బీసీల్లో తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోదగిన నాయకుడు ఎవరూ లేరని ఆరోపణలు కూడా వినిపించాయి.
దీంతో దీనిని భారతీయ జనతాపార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా గా క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కాసేపటి క్రితం టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. తక్కెళ్లపల్లి రవీంద్ర రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి పేర్లతో పాటు బండ ప్రకాష్ ను కూడా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు.
ఎమ్మెల్యే కోటాలో ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్ఎస్ పార్టీ దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ లో రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన వ్యూహం బిజెపికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండటానికే అని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. ఈటల రాజేందర్ తరహాలో బండ ప్రకాష్ కు కీలక శాఖలను అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత హరీష్ రావు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆరోగ్యశాఖను ఆయనకు కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. రాజ్యసభ సభ్యునిగా మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే సీఎం కేసీఆర్ రాజీనామా చేయించడం ఒకరకంగా సంచలనమే. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారిన అంశం. నామమాత్రమైన పదవి కాకుండా కీలక పదవి ఇవ్వటమే కాకుండా ఆయన వర్గానికి కూడా సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read : రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్సీ.. ఆ స్థానంలో సీనియర్ నేత..? కేసీఆర్ వ్యూహాలు