Idream media
Idream media
టిక్‌టాక్.. అనతికాలంలోనే విశేష ప్రాచూర్యం పొందిన యాప్. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మార్చిన టిక్‌టాక్‌కు కష్టకాలం వచ్చేసింది. భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తత నెలకొని ఉండడంతో ప్రజల భద్రత, దేశ రక్షణ దృష్ట్యా చైనా దేశానికి చెందిన టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తుండగా. మరికొంత మంది టిక్‌టాక్ ప్రేమికులు మాత్రం నిరుత్సాహపడుతున్నారు. తమను తాము వీడియోల్లో చూసుకుంటూ, తమ అభిమాన నటులు పాటలకు నృత్యాలు చేస్తూ వాటికి వచ్చే లైక్‌లను ఆస్వాధించిన టిక్‌టాక్ యూజర్లకు ఇది ఒకరంగా షాక్ అని చెప్పాలి.
అయితే టిక్‌టాక్ బదులు అచ్చు అలాగే ఉంటే దేశీయ యాప్ ‘చింగారి’ ఇప్పటికే అందుబాటులో ఉంది. స్వదేశీ ప్రొత్సహించాలంటూ ప్రధాని మోదీ పిలుపును అందుకున్న భారతీయులు ఇప్పటికే లక్షల సంఖ్యలో ‘చింగారి’ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ వద్దు.. చింగారి ముద్దు అంటూ కూడా వీడియోలు చేయడం మొదలు పెట్టారు. టిక్‌టాక్‌లో మాదిరిగా ఇక్కడ లక్షలాది మంది ఫాలోయర్లు సంపాధించేందుకు రంగంలోకి దిగారు. చింగారి వల్ల ఎలాంటి సమస్య ఉండదు. భవిష్యత్‌లో నిషేధిస్తారనే భయం లేదు. ప్రజల సమాచార భద్రతకు, దేశ రక్షణకు కూడా ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా చింగారిలో తమ టాలెంట్‌ను చూపించుకోవచ్చు.
షార్ట్ వీడియో సర్వీస్‌తో అచ్చంగా టిక్‌టాక్ మాదిరిగా ఉన్న చింగారిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, మళయాళం సహా ప్రముఖ భారతీయ భాషలన్నీ ఈ యాప్‌లో ఉన్నాయి. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చింగారి యాప్‌ను వినియోగించాలంటూ ప్రముఖులు సందేశాలు ఇస్తున్నారు. వివిధ అంశాల్లో ధైర్య, ప్రతిభ, పాఠవాలను చూపించిన వారిని అభినందించే విషయంలో ముందుండే ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా చింగారి యాప్‌ను ను వినియోగించాలంటూ ట్విట్ చేశారు. తాను ఇప్పటి వరకూ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేయలేదని, ఇప్పుడే చింగారిని డౌన్‌లోడ్ చేశానంటూ ట్విట్‌లో పేర్కొన్నారు.