iDreamPost
android-app
ios-app

దుమ్మురేపిన టీం ఇండియా.. ఈ ఆట సూపర్ గురూ!!

దుమ్మురేపిన టీం ఇండియా.. ఈ ఆట సూపర్ గురూ!!

భారత క్రికెట్ క్రీడాభిమానులకు ఈరోజు జరిగిన మ్యాచ్ ఒక పండగ లాంటిది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమ్ ఇండియా ఆటగాళ్ళు.. ఇంగ్లండ్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించారు.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్యన మొదలైన తొలి వన్డేలో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఒక్కరు కూడా ఎక్కవసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా బుమ్రా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించాడు. అందుకు షమీ కూడా తోడై 3 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ చాలా తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

ఇక తరువాత క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ లు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఒక పక్కన శిఖర్ ధవన్ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, మరోవైపు రోహిత్ శర్మ వరుస బౌండరీలతో హిట్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక్క వికెట్ కూడా పడకుండా మ్యాచ్ గెలిచంది టీం ఇండియా. మొత్తంగా మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş