iDreamPost
iDreamPost
రానున్న కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలోనే ప్రస్తుత వర్షాలని వివరించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, శాఖ, కృష్ణా, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదిలా ఉండగా అనూహ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల మేరకు ఏపీలో చలిగాలులు వీస్తున్నాయి. మబ్బు వాతావరణం కారణంగా చలితీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతల్లో కూడా భారీగా తేడాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతగాలుల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతాకాలం ప్రవేశించిన కారణంగా వైరస్‌లు విజృంభించేందుకు అవకాశం ఉంటుందని ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.