Idream media
Idream media
వారం రోజులు దాటినా హైదరాబాద్ మహా నగరంలో 100కు పైగా కాలనీలు ఇప్పటికే ముంపు ముంగిటే ఉన్నాయి. నీళ్లల్లోనే ఆవాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13న అత్యధికంగా 32 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 112 ఏళ్ల చరిత్రలో రెండో అత్యధిక వర్షపాతం అని రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఇది రెండో అతి పెద్ద విపత్తు అని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు మరో మూడు రోజులు భారీ వర్షాలు న్నాయనే వాతా వరణశాఖ హెచ్చరి కలతో ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఏపీ నుంచి ఇప్పటికే 15 బోట్లు
భారీ విపత్తులో చిక్కుకున్న తెలంగాణకు ఇతర రాష్ట్రాలు చేయూత అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితుల తరలింపు కోసం ఇప్పటికే 15 బోట్లను పంపింది. అవసరమైతే మరిన్ని బోట్లను పంపేందుకు సిద్ధంగా ఉంది. అలాగే కర్ణాటక నుంచి 15 బోట్లు రానున్నాయి. అలాగే ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ను ప్రభుత్వం కోరింది. మరో మూడు రోజుల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉంది. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక అంచనా మేరకు రూ.1,350 కోట్ల సహాయం అందజేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసింది. జీహెచ్‌ఎంసీలో రూ.670 కోట్ల నష్టం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బ్లాంకెట్లతోపాటు రూ.10 కోట్ల సహాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి, ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అత్యధిక వర్షపాతాలు ఇలా..
‘హైదరాబాద్‌లో 1908, సెప్టెంబర్ 28న ఒకే రోజు 43 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏడాదిలో అత్యంత అధిక వార్షిక వర్షపాతం 1916లో 142 సెం.మీ.లు రికార్డయింది. నగరంలో ఏడాదికి సగటు వర్షపాతం 77.9 సెం.మీ.లు కాగా ఈసారి ఇప్పటికే 120 సెం.మీ.లు పడింది. మరో రెండున్నర నెలల సమయం ఉన్నందున అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. 2004లో ఒకేరోజు బేగంపేటలో 24 సెం.మీ. నమోదైంది. ఈ సీజన్‌లో ఘట్‌కేసర్‌లో 32 సెం.మీ.లు పడింది’ అని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని శివార్లలో 33 మంది మరణించారు. వారిలో 29 కుటుంబాలకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం అందజేశాం. మిగతా నాలుగు కుటుంబాలకు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గల్లంతైన మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 37 మంది మరణించారు. ప్రభుత్వం వద్ద మృతుల వివరాలు, తదితర డేటాలేదని ప్రతిపక్షాలు సిల్లీ మాటలు మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో వచ్చే విషప్రచారాలు నమ్మొద్దు. ప్రభుత్వ సమాచారాన్నే నమ్మండి’అని మంత్రి స్పష్టంచేశారు.
శాశ్వత పరిష్కారం వైపు అడుగులు
‘నగరంలో వరదలకు ఏళ్ల తరబడి పలు కారణాలు న్నాయి. పరిస్థితి చక్కబడ్డాక శాశ్వత పరిష్కార చర్య లు ఆలోచిస్తాం. నాలాలు, చెరువుల కబ్జాలతోపాటు వాటిల్లో ఇష్టానుసారం వేస్తున్న ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలు తదితరమైనవెన్నో ముంపునకు కారణాలు. ఇవన్నీ ఒక్కరోజులో జరిగింది కాదు. నగరంలో 112 ఏళ్ల తర్వాత వచ్చిన విపత్తు ఇది. నేను వెళ్లిన దాదాపు 40 కాలనీల్లోని ప్రజలు కూడా శాశ్వత పరిష్కారం కోరారు. నష్టపరిహారంపై సీఎం తగిన నిర్ణయం తీసుకుంటారు. చెరువుల్లో కాలనీలు వచ్చా యని, ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, ఎల్‌ఆర్ ఎస్, బీఆర్‌ఎస్ చేస్తుందని కొందరు చెబుతున్నారు. వాటి గురించి మరోసారి చర్చించవచ్చు’అని ప్రతిపక్షాలకు కేటీఆర్ సూచించారు.