హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఇప్పటి వరకు 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 11 రౌండ్లలో రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యం సాధించారు.
11 రౌండ్లు ముగిసే సమయానికి ఈటెల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. లెక్కించిన ఓట్లలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌కు 48,588 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 43,324 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం సాధించింది. తొలిసారి 8వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 162 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే ఈ ఊపును టీఆర్‌ఎస్ కొనసాగించలేకపోయింది. ఆధిక్యం సాధిస్తున్నామనే టీఆర్‌ఎస్ ఆశలను అడియాశలు చేసేలా.. 9వ రౌండ్‌లో బీజేపీ 1835 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 10వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.
11వ రౌండ్‌లో మరోసారి టీఆర్‌ఎస్ 367 ఓట్ల ఆధిక్యం సాధించింది. మొత్తంగా సగం రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌పై పైచేయి సాధించారు. ఇంకా సగం కన్నా ఎక్కువ ఓట్లు లెక్కించాల్సి ఉంది. 22 రౌండ్లకు గాను కనీసం 18 రౌండ్లు పూర్తయితే తప్పా.. గెలుపుపై అంచనాకు వచ్చే అవకాశం లేదు. అందుకే బీజేపీ శ్రేణలు గెలుపు సంబరాలు ఇంకా మొదలుపెట్టలేదు.
Also Read : Huzurabad Bypoll – TRS అంచనాలు తలకిందులు..!