iDreamPost
android-app
ios-app

ఎవరీ గురుమూర్తి , తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ టికెట్ ఖాయమేనా ?

  • Published Nov 22, 2020 | 7:48 AM Updated Updated Nov 22, 2020 | 7:48 AM
ఎవరీ గురుమూర్తి , తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ టికెట్ ఖాయమేనా ?

గురుమూర్తి జగన్ ఫిజియోథెరపిస్టు , పాదయాత్రలో జగన్ కి సేవలందించినందుకు టికెట్ లభించిందని , పాదయాత్ర తర్వాత జగన్ ని కలవటానికి ఇబ్బంది పడ్డాడని , చివరికి జగన్ ప్రయాణిస్తున్న విమానం ఎదో తెలుసుకొని అదే ఫ్లయిట్ లో టికెట్ కొనుక్కొని జగన్ కలిసాడని , ఇన్నాళ్లు ఏమైపోయావు అని జగన్ అడిగితే కలవటానికి పడ్డ ఇబ్బందుల గురించి తెలపగా జరిగింది గ్రహించిన జగన్ అతనికి ఉద్యోగం ఇచ్చి , అతని విశ్వసనీయత చూసి ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చాడని ఇలా రకరకాల వార్తలు పలు వార్తా మాధ్యమాల్లో గత రెండురోజులుగా వెలువడ్డాయి .

ఇటీవలి కాలంలో కొన్ని వార్తా సంస్థల తీరు చూస్తే సినీ కథనాలకు, సస్పెన్స్ సీరియళ్లకు వార్తా ప్రసారాలకు తేడా లేకుండా పోతుంది. వార్తని డెస్క్ వెనక ఉంచి తమకనుకూలమైన రీతిలో కాల్పనిక గాథలతో చేసే అసత్య ప్రచారాన్నే వార్త అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు . ఈ కోవలోనే ఫిజియోథెరపిస్టు గురుమూర్తి పై కూడా పలువురు పలు రకాల కధనాలు వార్త రూపంలో వండి వార్చారని చెప్పొచ్చు….

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన ఎం.గురుమూర్తి నేపద్యాన్ని గమనిస్తే, వైఎస్ఆర్ హయాంలో ఫిజియోథెరపి స్టూడెంట్ గా ఉన్న గురుమూర్తి మెడికల్ కౌన్సిల్ తరహాలో ఫిజియోథెరపి కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో తన నాయకత్వంలో కొందరు విద్యార్థులతో వైఎస్ ని పలుమార్లు కలిశారు . ఫిజియోథెరపి పూర్తయ్యిన తర్వాత మిగతా విద్యార్థులు ప్రాక్టీస్ లో స్థిరపడి దూరమైనా తను మాత్రం కౌన్సిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు . ఈ క్రమంలో వైఎస్ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది . వైఎస్ మరణం తర్వాత తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా వైఎస్ కుటుంబంతో టచ్ లో ఉంటూ వచ్చారు . రాజకీయంగా బహిరంగంగా గురుమూర్తి పేరు వినపడక పోయినప్పటికీ రాజకీయ సంబంధాలు బాగా మైంటైన్ చేసేవారు గురుమూర్తి .

Also Read: ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల వైపుకి విద్యార్థులు

జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి స్థానికంగా పార్టీ ఏర్పాటు చేసే కార్యక్రమల్లో ఒక సామాన్య కార్యకర్తగా పాల్గొంటూ వచ్చారు. 2013 లో వైఎస్ షర్మిళ పాదయాత్ర సమయంలో తెరవెనుక క్రియాశీలక పాత్ర పోషించిన గురుమూర్తి , పాదయాత్ర సందర్భంగా షర్మిళ కాలి గాయాలకు వైద్యుడిగా సేవలందించారు . దేశంలోనే ప్రథమంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవటం కోసం ఓ మహిళగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 116 నియోజకవర్గాల్లో పర్యటించి చరిత్ర సృష్టించిన వైఎస్ షర్మిళ పాదయాత్ర ఆసాంతం వైద్య సేవలందించి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు గురుమూర్తి .

ఇహ చారిత్రాత్మకమైన వైఎస్ జగన్ పాదయాత్ర ప్రజాప్రస్థానం సందర్భంగా పలుమార్లు వేళ్ళ గాయాలకు , కాలి నొప్పులకు గురికాగా పాదయాత్ర పూర్తయ్యేవరకూ దగ్గరుండి ఫిజియో సేవలు అందించి జగన్ పాదయాత్ర నిరాటంకంగా కొనసాగటానికి తోడ్పడ్డారు . 2019 లో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ICDS లో దివ్యంగుల , ట్రాన్సజెండర్ , సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్ గా సేవలందించారు గురుమూర్తి …

Also Read: బీజేపీ మాజీ ఎంపీని కూడా వదిలిపెట్టని జీవీఎంసీ

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణం తర్వాత పోటీకి వారి కుటుంబ సభ్యులకు కాకుండా అనివార్య కారణాల రీత్యా వేరేవారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సరైన అభ్యర్థి ఎవరూ అన్న చర్చ వచ్చినప్పుడు తిరుపతిలోనే వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తూ స్థానిక రాజకీయాల పట్ల అవగాహన ఉన్న గురుమూర్తి పేరు ప్రస్తావనకు వచ్చింది . 2019 ఎన్నికల ముందు పార్లమెంట్ అభ్యర్థి అంటే భారీ స్థాయి వ్యాపారవేత్తలు అనే అపోహలకు తెర దించుతూ విద్యాధికులకు , యువకులకు అవకాశం కల్పించిన జగన్ నందిగం సురేష్ వంటి సామాన్యుణ్ణి సైతం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం కోసం ఎంపిక చేసి సంచలనం సృష్టించారు . ఇప్పుడు అదే వరవడి కొనసాగిస్తూ ఆర్ధిక బలాబలాల గురించి ఆలోచించకుండా యువకుడు , విద్యాధికుడు అయిన గురుమూర్తిని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయబోతున్నారని సమాచారం.

ఏవైనా అనుకోని హఠాత్పరిణామాలు సంభవిస్తే తప్ప దాదాపు గురుమూర్తే తిరుపతి అభ్యర్థి . ఈ నిర్ణయంతో జగన్ మరో సంచలనం సృష్టించడమే కాకుండా 35 ఏళ్ల యువకుడైన గురుమూర్తి సాంప్రదాయ రాజకీయ కుటుంబం నుండి రాకపోయినా , బలమైన ఆర్ధిక నేపధ్యం లేకపోయినా తన సమర్ధత , విశ్వసనీయతతో టికెట్ పొందడం చూసిన యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి మరింత పెరిగిందని చెప్పొచ్చు .

Read Also ; జగన్‌కు మేలు చేస్తున్న ఆంధ్రజ్యోతి రాథాకృష్ణ..!