ఆత్మకూరు లో స్థానికేతరులను గుర్తించి ముందుగానే గ్రామం నుంచి బయటకు పంపి బాబుగారిని ,ఆయనతోపాటు మరో పది మంది నాయకులను ఒక 40-50 మంది కార్యకర్తలను మొత్తంగా 10 వాహనాల కాన్వాయ్ ని ఆత్మకూరుకు పోలీసులు స్వయంగా తీసుకెళ్ళాలసింది.ప్రైవైట్ మీడియాను అనుమతించకుండా పోలీసులే స్వయంగా ఒక వీడియోగ్రాఫర్ ను పెట్టి మొత్తం పర్యటనను రికార్డు చేసి మీడియాకు విడుదలచెయ్యవల్సింది.టీడీపీ వారు కోరితే వారి తరుపున కూడా ఒక వీడియో గ్రాఫర్ ని అనుమతించవలసింది.
ప్రచారఆర్భాటం లేకుండా బాబుగారు బాధితుల వివరాలు తెలుసుకునే అవకాశం దక్కేది. చట్టం తనపని తానూ చేసుకొని పోవటం అంటే ఏమిటో బాబుగారు స్వయంగా తెలుసుకోగలిగేవారు. అసలు బాధితులు ఎవరో రాజకీయ ప్రేరేపిత బాధితులు ఎవరో పోలీసులకు కూడా సులభంగా అర్ధమయ్యేది.