ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి చోటు చేసుకుంది. టీడీపీ నేత, దివంగత కొడెల శివప్రసాద్ వర్థంతి సభలో.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో వ్యవహరించిన టీడీపీ నేతల తీరుకు నిరసన వ్యక్తం చేసేందుకు ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలసి కృష్ణా నది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు.
సీఎం వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసేలా టీడీపీ నేతలను చంద్రబాబే ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ, తక్షణమే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి .ఈ సమయంలో చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అధికారం కోల్పోయిన తర్వాత నుంచి టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారనేందుకు తాజాగా ఘటనే నిదర్శనం. రెండేళ్లు దాటుతున్న పార్టీ పరిస్థితి పుంజుకోలేకపోవడంతో.. వైసీపీ బలం పెరుగుతుండడంతో ఆ అసహనం వారి నుంచి మాటల రూపంలో బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పలుచోట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ శ్రేణులను తిట్టారు. యువకుడైన లోకేష్‌తోపాటు.. సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు.. లోకేష్‌ను మించి అసభ్యపదజాలంతో సీఎం వైఎస్ జగన్‌ను దూషించారు. వయస్సు, సీనియారిటీని విస్మరించి అయ్యన్న చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.
Also Read : టీటీడీ పాలకమండలి, టీడీపీ వాదనలో వాస్తవమెంత