రాష్ట్రంలో ఎప్పుడూ చూడని కొత్తపోకడను కొంతకాలంగా చూస్తున్నాం. పాలనపరమైన అంశాల్లో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గతంతో పోల్చుకుంటే ఎక్కువగానే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు కారణంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా TTD తీసుకున్నఓ నిర్ణయాన్ని కూడా అడ్డుకోవాలంటూ కోర్టుకెక్కగా..పిటిషన్ కు విచారణా అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
TTD పరిధిలోని దేవాలయాల్లో వినియోగించిన పూల నుంచి అగరబత్తీలు తయారు చేసే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ఈ మేరకు ఓ మూడు రకాల బ్రాండ్లను కూడా విడుదల చేశారు. అయితే ఈ పద్ధతి ఆగమశాస్త్ర నియామకాలకు వ్యతిరేకమంటూ ఓ పిటిషన్ దాఖలు కాగా.. పరిశీలించిన కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది.
ఓ మంచి నిర్ణయం..
దేశ, విదేశాలను నుంచి తెప్పించిన వివిధ రకాల అరుదైన పుష్పాలను టీటీడీ పరిధిలోని వివిధ దేవాలయాలల్లో దేవతామూర్తుల పూజకు వినియోగిస్తారు. పండగలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక సందర్భాలలో కూడా టన్నుల కొద్ది పుష్పాలను ఉపయోగిస్తారు. పూజ కోసం వినియోగించిన పువ్వులను తొలగించిన తర్వాత వాటితో అగర బత్తీలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని టీటీడీ స్పష్టంగా పేర్కొంది. శ్రీవారి పూజకు వాడిన పూలను పూల బావిలోనే వేస్తున్నారు. వాటిని అగరబత్తీల తయారీకి వాడటం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కొందరు కావాలనే వివాదం సృషించే చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
మరో పవిత్ర కార్యాయానికి వినియోగం..
దైవ కార్యానికి వాడిన పువ్వులను వృథాగా వదిలివేయకుండా రీ యూజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అపవిత్రం లేకుండా వృథాగా పోకుండా దైవ పూజకు ఎంత పవిత్రతో వినియోగించామో.. అంతే పవిత్ర భావంతో రీయూజ్ చేయగల్గితే మళ్లీ ఓ పవిత్ర కార్యక్రమానికి ఉపయోగించవచ్చినే ఉద్దేశమే తప్ప ఆదాయ వనరుగా చూడటం లేదన్నారు. తొలగించిన పువ్వులను పొడిచేసి వాటితో ఏడుకొండలకు ప్రతీకగా ఏడు బ్రాండ్లతో అగర బత్తీలు తయారు చేసి ఇళ్లలో జరిపే పూజల్లో వాడుకునే చర్యల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమం కూడాను.