iDreamPost
android-app
ios-app

షాకింగ్ : రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్ కి గాయాలు.. ఇప్పుడెలా ఉందంటే?

షాకింగ్ : రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్ కి గాయాలు.. ఇప్పుడెలా ఉందంటే?

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజు హైదరాబాదులో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన టాలీవుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.. నటుడు సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబం నుంచి మెగా మేనల్లుడి గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. అయితే ఆయన ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈరోజు పొద్దుపోయాక సాయి ధరంతేజ్ తన నివాసం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జి మార్గంలో గచ్చిబౌలికి బయలుదేరారు, అయితే కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ వద్ద ఆయన లెఫ్ట్ టర్ను తీసుకుంటున్న సమయంలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురయ్యారు.

రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బండి 120 కిలోమీటర్ల వేగంతో ఉందని రోడ్డు మీద ఇసుక ఉండటంతో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి ఆయన నడుపుతున్న బైక్ ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. హుటాహుటిన అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్ ను రప్పించి ఆయనను దగ్గరలో ఉన్న మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ కు తరలించినట్లు చెబుతున్నారు. అయితే మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ కొద్దిసేపటి క్రితమే స్పందించింది.. సాయిధరమ్ తేజ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయనకు తగిన చిన్న గాయాలనే అని, కాకపోతే ఆయన స్పృహ తప్పారని, ఆ విషయంలో కేర్ తీసుకుంటున్నామని చెబుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే సాయి ధరం తేజ్ ను రామ్ చరణ్ భార్య ఉపాసనకు చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది..

కొద్దిసేపటి క్రితమే సాయి ధరంతేజ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన తల్లి, సోదరుడు వైష్ణవ్ తేజ్ హాస్పిటల్ కి వచ్చారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోతే అపోలో హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉందని అంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే సాయి ధరంతేజ్ హెల్మెట్ ధరించి ఉండడంతో తలకు బలమైన గాయం తగల లేదు కానీ కంటికి గాయం అయిందని అంటున్నారు. అలాగే ఛాతీ, పొట్ట భాగంలో గాయాలైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ కి తీసుకు వెళుతున్న సమయంలో స్పృహ లేదని చికిత్స అందించిన తర్వాత ఆయన స్పృహలోకి వచ్చారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.