హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పరిగెడుతున్నాయి. 90 ‘స్థానాలున్న హర్యానా లో బిజెపి 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐఎన్ఎల్డి 2 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికారం చేపట్టాలంటే 46 స్థానాలు గెలవాలి. కాగా ప్రస్తుత ఫలితాల సరళి ఏ పార్టీకి ఆధిక్యం వచ్చేటట్లు కాపాడడం లేదు. గత ఎన్నికల్లో 47 స్థానాలు గెలుచుకుని బిజెపి అధికార పీఠం ఎక్కింది. కాంగ్రెస్ 15 సీట్లు, ఐఎన్ఎల్డి 20, స్వతంత్రులు 8 చోట్ల గత ఎన్నికల్లో గెలిచారు.