iDreamPost
android-app
ios-app

రిస్క్ తీసుకుంటున్న హాథీ

  • Published Mar 24, 2021 | 6:10 AM Updated Updated Mar 24, 2021 | 6:10 AM
రిస్క్ తీసుకుంటున్న హాథీ

ఉన్నట్టుండి నిన్న ఎరోస్ సంస్థ రానాతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హాథీ మేరె సాతి విడుదల వాయిదా వేయడం అందరిని షాక్ కు గురి చేసింది. కానీ తెలుగు తమిళ వెర్షన్లు అరణ్య మాత్రం రిలీజ్ అవుతాయని చెప్పడం అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే ఇలా ఒక భాషలో ఆపి మరోభాషలో తీసుకురావడంలో కొంత రిస్క్ ఉంది. కొందరు యాక్టర్లు మినహా మిగిలిన సినిమా అంతా మూడు భాషల్లోనూ ఒకటే ఉంటుంది. ముఖ్యంగా చాలా కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్, విఎఫ్ఎక్స్ వాడిన సన్నివేశాలు, ఏనుగులతో చిత్రీకరించిన ఎపిసోడ్స్ లాంగ్వేజ్ కు ఒకరకంగా ఉండవు. అలాంటప్పుడు సౌత్ వెర్షన్ల ప్రభావం హిందీ మీద ఉంటుంది.

ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయాక నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఏ సినిమా గురించైనా తెలుసుకునే సౌలభ్యం ప్రేక్షకులకు ఉంటోంది. అది రివ్యూల రూపంలోనా లేక ప్రభుత్వాలు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పైరసీ దారిలోనా ఏదో ఒకటి అరణ్య గురించి పూర్తి సమాచారం అక్కడి ఆడియెన్సుకి ముందే తెలిసిపోతుంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియా సౌత్ సినిమాల గురించి ప్రత్యేకమైన విశ్లేషణలు అందిస్తోంది. సో అరణ్యలో ఉన్న గుడ్డు బ్యాడు అంతా ముందే వివరంగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంత వరకు ఎఫెక్ట్ ఇస్తుందనేది చెప్పలేం కానీ మరీ తీసిపారేయదగ్గ అంశమైతే కాదు.

నితిన్ రంగ్ దేతో పోటీ పడుతున్న అరణ్య మీద రానా చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. చాలా కష్టపడి చేసిన సినిమా కావడమే అందుకు కారణం. అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ద ఊపు కనిపించడం లేదు కానీ టాక్ బాగా వచ్చిందంటే మాత్రం స్పీడ్ అందుకోవడం సులభం. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన అరణ్య ఏనుగులను అడవుల్లో కాపాడుకునే కాన్సెప్ట్ మీద రూపొందింది. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ దీంతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఇవాళ విడుదలైన కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాతో పాటు ఎల్లుండి రంగ్ దేతో పోటీ పడుతున్న అరణ్య కనక హిట్ అయితే విరాటపర్వంకు బాగా ప్లస్ అవుతుంది.